-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతుల మీదుగా గృహ యజమానులకు 3 రకాల చెత్త సేకరణ డబ్బాల పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 27వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరామ్ తో కలిసి ఆయన పర్యటించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్లాప్(క్లీన్ ఆంధ్రప్రదేశ్) కార్యక్రమాన్ని మోడల్ డివిజన్ లుగా 27, 36 వార్డులలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థ పదార్ధాలను వేర్వేరుగా సేకరించవలసిన ఆవశ్యకతపై గృహ యజమానులకు శాసనసభ్యులు వివరించారు. విజయవాడ నగర పరిశుభ్రతకు గృహ యజమానులందరూ సహకరించాలని కోరారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి గృహ యజమానులకు 3 రకాల చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. నగర ప్రజలు చెత్తను కాలువల్లో వేయకుండా ఈ చెత్త బుట్టలను వినియోగించి నగర పరిశుభ్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే స్వచ్చతలో విజయవాడకు కేంద్రం నుంచి పలు అవార్డులు వచ్చాయని, ప్రజలందరూ ఇలాగే పరిశుభ్రతను పాటిస్తే స్వచ్ఛ విజయవాడ అవార్డు కూడా వచ్చే అవకాశం ఉందని మల్లాది విష్ణు అన్నారు. మరోవైపు ఆస్తి పన్నుపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను మల్లాది విష్ణు ఖండించారు. జీవో నెం.198పై ప్రతిపక్షాలు కావాలనే విష ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అవినీతికి చెక్ పెట్టేందుకే కొత్త పన్ను విధానం అమలుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈనెల 28న జరగనున్న ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బొప్పన గాంధీ, యర్రంశెట్టి శ్రీనివాసరావు, ఆచారి, తుపాకుల చంద్రశేఖర్, మండ రాము, లంకా కుమార్, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.