-దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
-డివిజినల్ రైల్వే మేనేజర్లతో భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించిన జనరల్ మేనేజర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య వర్షాకాలంలో తీసుకోవాల్సిన తగు ముందు జాగ్రత్తలు, భద్రత, సరుకు లోడిరగ్, రైళ్ల నిర్వహణలో సమయపాలన మొదలగు అంశాలపై సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుండి నేడు అనగా 26 జులై 2021 తేదీన సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ డివిజినల్ రౖౖెల్వే మేనేజర్లు (డీఆర్‌ఎమ్‌లు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జోన్‌లోని భద్రతా అంశాలపై ప్రధానంగా ప్రస్తుత వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై గజానన్ మాల్య సమీక్షించారు. జోన్‌లో వంతెనలు, పరిమిత ఎత్తుగల సబ్‌వేలు మరియు గుర్తించిన ఇతర ప్రాంతాలు మొదలగు వాటిపై నిరంతర నిఘా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ట్రాకులపై నీరు నిల్వకుండా సైడ్ వాటర్ డ్రెయిన్లు, క్యాచ్ వాటర్ డ్రెయిన్లు మరియు నీరు పారే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రైళ్ల రవాణా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. డివిజినల్ మరియు ప్రధాన కార్యాలయాల స్థాయిలలో నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు మరియ సిబ్బందికి సందర్భానుసారంగా తగు సూచనలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ట్రాక్ పటిష్టతకు తగు చర్యలు తీసుకుంటూ మరియు ట్రాక్ నిర్వహణ పనులను సమీక్షించాలని జనరల్ మేనేజర్ అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా అనునిత్యం సమన్వయం కలిగుండాలని ఆయన అన్నారు. జనరల్ మేనేజర్ ఇటీవల ప్రారంభించిన అన్‌రిజర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులపై కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రైళ్లలో రోజుకు సుమారుగా 78,000కు పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు. జనరల్ మేనేజర్ జోన్‌లో సరుకు రవాణా లోడిరగ్‌పై సవివరంగా సమీక్షించారు. సరుకు రవాణా అభివృద్ధికి ఉత్తమ పనితీరును కనబరుస్తున్న అధికారులను మరియు సిబ్బందిని ఆయన అభినందించారు. సరుకు రవాణాలో మరింత అభివృద్ధికి నూతన మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు. నూతనంగా నిర్మించిన రైలు మార్గాలలో వేగం పెంపుపై జనరల్ మేనేజర్ సమీక్షించారు. జోన్‌లో రైళ్ల నిర్వహణ సమయపాలనలో మరింత అభివృద్ధికి కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.