మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. మంగళవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
తొలుత ఒక మహిళ మంత్రిని కలిసి తన సమస్య తెలిపింది. తన తండ్రి చనిపోయారని తన తల్లికి పింఛన్ కావాలని తన తల్లి అత్తగారు పింఛన్ పొందుతున్నారని వీరంతా ఒకే రేషన్ కార్డులో ఉన్నారని ఈ ఇరువురిని రేషన్ కార్డులో వేరు చేస్తే రెండు పింఛన్ లు పొందవచ్చని ఆశపడుతున్నట్లుగా ఆమె తెలిపింది. ఈ విషయమై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటుంటే ఒక పింఛన్ను రద్దు కాబడుతుందన్నారు. ఆధార్ కార్డు, ప్రజాసాధికార సర్వేల ఆధారంగా రాష్ట్రంలో ఒకే రేషన్ కార్డు మీద రెండు పింఛన్లు పొందుతున్న వారి వివరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించిందని ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటే ఒక పింఛన్ను రద్దు చేయనున్నదని చెప్పారు. దివ్యాంగ, కిడ్నీ వ్యాధిగ్రస్తుల (డయాలసిస్ రోగులు), డీఎమ్హెచ్వో(క్యాన్సర్, థలసీమియా, పక్షవాతం) పింఛన్లకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. ఆధార్లో వయసు మార్పు చేసినవారు.. రేషను కార్డును పింఛనుకు అనుసంధానం చేయని వారు… ఒకే రేషన్కార్డు ద్వారా కుటుంబంలో రెండు లేదా అంతకు మించి పింఛన్లు ఉన్న వారిని గుర్తించి అనర్హులను క్షేత్ర స్థాయిలోనూ, సాంకేతికంగానూ పరిశీలించాకే తొలగింపు ఉంటుందని మంత్రి చెప్పారు. తద్వారా మరికొంత మంది అర్హులకు పింఛన్లు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
మచిలీపట్నం మండలంలోని ఎన్. గొల్లపాలెం గ్రామానికి చెందిన కుక్కల కుమారి మంత్రిని కలిసింది. తనకు అసైన్డ్ భూమి ఉందని రైతు కర్షక్ లోన్ 6 లక్షల ఇప్పించాలని అభ్యర్ధించింది. భూమి స్వంతం కాకపోతే , ఆ రుణం రాదనీ, ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిని సాగు చేస్తే మాత్రం పంట రుణం ఇస్తారని ఆమెకు మంత్రి పేర్ని నాని వివరించారు.
మచిలీపట్నం లోని పాత రామన్నపేటకు చెందిన అచ్యుత మాధవి, సర్కిల్ పేటకు చెందిన పుప్పాల సుధలు మంత్రిని కలిసి తమకు విద్యుత బిల్లులు అధికమొత్తంలో వస్తున్నాయని చెప్పారు. రెండు నెలలకు 1085 యూనిట్లు విద్యుత్ బిల్లు వచ్చిందని 7, 462 రూపాయల చెల్లించమంటున్నారని, ఈలోపున మరో బిల్లు సిద్ధమైందని 349 యూనిట్లకు 2, 980 రూపాయలు మొత్తం 10, 444 చెల్లించాలని విద్యుత్ శాఖాధికారులు వత్తిడి తెస్తున్నారని మాధవి మంత్రికి చెప్పారు. తనకు అధిక మొత్తంలో కరంట్ బిల్లు 9,392 రూపాయలు వచ్చిందని ఆ మొత్తం చెల్లించమని విద్యుత్ అధికారులు అంటున్నారని మంత్రికి సుధ అనే మహిళ వివరించింది.
స్థానిక లక్ష్మణరావుపురం దిమ్మల సెంటర్ కు చెందిన పాస్టర్ మట్టా మేరీ పాల్ మంత్రి వద్ద తన ఇబ్బంది చెప్పుకొన్నారు. 2013 తాను ఒకరి వద్ద ఇల్లు కొని రిజిస్ట్రేషన్ తన పేర చేయించుకున్నానని ఇంటి పన్ను సైతం కటుతున్నానని, ఇటీవల ఇంటి పన్ను తన పేరున కాక ఇంటి పన్ను పాత యజమాని కుమారుని పేరున వచ్చిందని వాపోయారు.
Tags machilipatnam
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …