-ఐఏయస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో యస్వీ. ప్రసాద్ దంపతులకు నివాళులు అర్పిస్తూ
సంస్మరణ సభ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి యస్వీ. ప్రసాద్ దంపతులకు రాష్ట్ర ఐఏయస్ అధికారుల ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరిగింది. తొలుత యస్.వి. ప్రసాద్, వారి సతీమణి శ్రీలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈసంస్మరణ సభ కార్యక్రమంలో పలువురు మాజీ ఐఏయస్ అధికారులు, ప్రస్తుత ఐఏయస్ అధికారులు పాల్గొని యవి. ప్రసాద్ సేవలను కొనియాడారు. స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన యవి. ప్రసాద్ సంస్మరణ కార్యక్రమం లో సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ప్రవీణ్ కుమార్, సహకారశాఖ కమిషనరు బాబు.ఏ, జిల్లా కలెక్టరు జె.నివాస్, వియంసి కమిషనరు వి.ప్రసన్నవెంకటేష్, జాయింట్ కలెక్టర్లు యల్. శివశంకర్, యయస్.అజయ్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టరు జియయస్. ప్రవీణ్ చంద్, తదితరులు పాల్గొని స్వర్గీయ యస్.వి.ప్రసాద్ దంపతులకు నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ నిబద్ధత, క్రమశిక్షణతో ఎప్పుడూ చిరునవ్వుతో యస్వీ. ప్రసాద్ తమ విధులను నిర్వర్తించేవారన్నారు. అందరితో మృదువుగా మాట్లాడే యవి. ప్రసాద్ అనేక ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. సహకారశాఖ కమిషనరు బాబు.ఏ మాట్లాడుతూ నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో స్వర్గీయ యస్.వి. ప్రసాద్ కీలక పదవులు నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చెరగని చిరునవ్వుతో యవి. ప్రసాద్ సమర్ధవంతంగా సహోద్యుగులతో సహకరిస్తూ ఉండేవారన్నారు. వర్చువల్ విధానంలో పలువురు మాజీ ఐఏయస్ అధికారులు యల్ వి. సుబ్రహ్మణ్యం, కృష్ణయ్యలతోపాటు ఐఏయస్ అధికారి ప్రద్యుమ్న, తదితరులు స్వర్గీయ యస్.వి. ప్రసాద్ దంపతులకు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా శ్రీ యస్.వి.ప్రసాద్ కుటుంబసభ్యులైన వర్ధన్ శైలేష్ కూడా పాల్గొని తమ కుటుంబంపట్ల చూపిన సానుభూతి, అభిమానం మాకెంతో ధైర్యాన్ని కలిగిస్తునదన్నారు.