Breaking News

గండ్రోతు అంజలిదేవి కొవ్వూరు మునిసిపాలిటీ 2వ వైస్ ఛైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మునిసిపాలిటీ 2వ వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ను నిర్వహించిన ఎన్నికల ప్రొసీడింగ్స్ అధికారి, కొవ్వూరు ఆర్డీవో డి. లక్ష్మారెడ్డి నిర్వహిం చారు. ప్రక్రియ అనంతరం 8వ వార్డు కౌన్సిలర్ గండ్రోతు అంజలిదేవి ఏకగ్రీ వంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మంగళవారం కొవ్వూరు మున్సిపాలిటీ సమావేశమందిరంలో 2వ కొవ్వూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొవ్వూరు కౌన్సిలర్లు 23 మందికి గాను ఒకరు మరణించిన కారణంగా మిగిలిన 22 మంది సభ్యులు ప్రత్యేక సమావేశమునకు హాజరయ్యారని లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించి పార్టీ నుంచి ఫారం ఏ, బి ను గండ్రోతు అంజలిదేవి పేరు పై జిల్లా ఇంఛార్జి మంత్రి పేర్ని వెంకట్రా మయ్య గారిచే జారీ చేసినట్లు ఎన్నికల ప్రొసీడింగ్స్ అధికారి తెలిపారు. కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో 8వ వార్డు కౌన్సిలర్ గండ్రోతు అంజలిదేవి పేరుని 21వ వా ర్డు కౌన్సిలర్ సఖినేటిపల్లి చాందిని ప్రతిపాదించగా, 14 వ వార్డ్ కౌన్సిలర్ చీర్ల అరుణ బలపరిచారు. తదుపరి సభ్యుల ఆమోదంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి గండ్రోతు అంజలిదేవి కొవ్వూరు మునిసిపాలిటీ 2వ వైస్ ఛైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు, దివ్యంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలతో పాటు , మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్న కుమారి లు నూతనంగా ఎన్నికైన వైస్ ఛైర్ పర్సన్ గండ్రోతు అంజలిదేవి ని అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సమావేశంలో మొదటి వైస్ ఛైర్మన్ మన్నే పద్మ , కౌన్సిలర్లు కోడూరి శివరామ కృష్ణ, మునిసిపల్ కమిషనర్ కేటి సుధాకర్ తదితరులు 2వ వైస్ ఛైర్ పర్సన్ జి.అంజలీదేవి ని అభినందించారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *