Breaking News

వ్యవసాయానికి పవర్ ఫుల్ పంపుసెట్లు…

-పీఎంబీఎల్డీసి మోటర్ల ఆవిష్కారం పై పరిశోధనకు ఏ పీ సీడ్కో శ్రీకారం
-పంపుసెట్ల సామర్థ్యం పెంపు, వాటి జీవిత కాలాన్ని రెట్టింపు చేయటమే లక్ష్యం
-ఆంధ్రా యూనివర్సిటీ తో ఎంఓయూ
-పీఎంబీఎల్డీసి టెక్నాలజీ తో 90 శాతానికి పెరగనున్న వ్యవసాయ పంపుసెట్ల సామర్థ్యం
-10 నుంచి 20 సంవత్సరకు పెరగనున్న పంపుసెట్ల జీవిత కాలం
-పీ ఎం బీ ఎల్ డీ సి, ఇంధన సామర్ధ్య సాంకేతికలతో వ్యవసాయ రంగంలో 30 శాతం వరకు విద్యుత్ ఆదా చేసే అవకాశం
-సాంప్రదాయ ఇండక్షన్ మోటర్లకు ప్రత్యామ్న్యాయంగా బీఎల్డీసి మోటర్లు
-ఉచిత విద్యుత్ తో వ్యవసాయ రంగం పటిష్టం .. రైతుల జీవన ప్రమాణాలు మెరుగు… : ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి
-వ్యవసాయానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్న సి ఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి
-వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ , రైతులకు ఆర్థిక ప్రయోజనం .. ఇదే నూతన ప్రాజెక్టు లక్ష్యం
-ఇంధన రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యత… : రాష్ట్ర ఇంధన కార్యదర్శి, శ్రీకాంత్ నాగులాపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ పంపుసెట్ల సామర్ధ్యాన్ని పెంచడం తో పాటు వాటి జీవిత కాలాన్ని దాదాపు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ఇంధన శాఖ కు చెందిన ఏ పీ సీడ్కో(ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్ధ్య అభివృద్ధి సంస్థ) పేర్మనెంట్ మాగ్నెట్ బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంటు (పీఎంబీఎల్డీసి) అనే అధునాతన సాంకేతికతను రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ సాంకేతికత క్షేత్ర స్థాయిలో అమలైతే వ్యవసాయ రంగంతో పాటు రైతులు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతారు. ఈ పీఎంబీఎల్డీసి సాంకేతికత పై లోతైన పరిశోధనలు జరిపే నిమిత్తం ఆంధ్రా యూనివర్సిటీ తో ఏపీసీడ్కో ఒక అవగాహనా ఒప్పందాన్ని(ఎంఓయూ) కుదుర్చుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఏటా సుమారు 18,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం విద్యుత్ డిమాండులో ఇది దాదాపు 28 శాతంగా ఉంది. మరో వైవు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పగటి పూటే 18 లక్షల పైగా వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తోంది. ఈ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఏపీ సీడ్కో వ్య్వవసాయ పంపుసెట్ల సామర్ధ్యాన్ని వాటి జీవిత కాలాన్ని పెంచడం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందుకే పీఎంబీఎల్డీసి సాంకేతికత పై లోతైన పరిశోధనలు జరిపి , వ్యవసాయ మోటర్లలో ఆ సాంకేతికత ఎలా వినియోగించాలనే అంశం పై పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రా యూనివర్సిటీ లో ఈ పరిశోధనలు కొనసాగనున్నాయి. పీఎంబీఎల్డీసి టెక్నాలజీని వ్యవసాయ మోటర్లలో ప్రవేశ పెడితే పంపుసెట్ల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 75 శాతం నుంచి 90 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు . అలాగే పంపుసెట్ల జీవిత కాలం ప్రస్తుతం 10 సంవత్సరాలు ఉండగా, ఇది 15 నుంచి 20 సంవత్సరాలకు పెంచవచ్చునని భావిస్తున్నారు. పీఎంబీఎల్డీసి సాంకేతికత తో పాటు ఇతర ఇంధన సామర్ధ్య చర్యలను సమర్ధవంతమగా అమలు చేస్తే వ్యవసాయ రంగంలో సుమారు 30 శాతం వరకు విద్యుత్ ను ఆదా చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ నూతన సాంకేతికత వ్యవసాయ మోటర్లలోనే కాకుండా గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ మోటార్లు, ఎయిర్ కండిషనర్లు,రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు , పరిశ్రమల్లో వాడే కంప్రెసర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు తదితర వాటివంటి సామర్ధ్యాన్ని పెంచేందుకు కూడా ఇది దోహద పడుతుంది. ఈ నేపథ్యంలో పీఎంబీఎల్డీసి సాంకేతికత పై పరిశోధనలకు సంబంధించి ఆంధ్రా యూనివర్సిటీ అధికారులతో ఏపీ సీడ్కో ఇప్పటికే ఒక వెబినార్ ను నిర్వహించింది. ఈ నూతన సాంకేతికత కు సంబందించిన ప్రాథమిక అంశాలపై రెండు సంస్థల అధికారులు సమగ్రంగా చర్చించారు.
ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న సాంప్రదాయ ఇండక్షన్ మోటర్లకు సమర్ధవంతమైన ప్రత్యామ్న్యాయంగా బీఎల్డీసి మోటార్లను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఇంధన శాఖ భావిస్తుంది. బీఎల్డీసి మోటర్లలో ఉండే అధునాతన సాంకేతికత వల్ల సాంప్రదాయ మోటర్లకంటే తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి. బీఎల్డీసి మోటర్లలో రోటర్ వైడింగ్లు , బ్రష్ లు ఉండకపోవటం వంటి అంశాల కారణంగా విద్యుత్ వినియోగం తగ్గుతుందని సాంకేతిక నిపుణులు తెలియచేసారు.

పీఎంబీఎల్డీసి ప్రాజెక్ట్ పై ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కి ఇంధన శాఖ కార్యదర్శి వివరించారు. దీని పై మంత్రి స్పందిస్తూ వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని , ఇందుకోసం నూతన సాంకేతికతను వినియోగించుకునేందుకు ఏ పీ సీడ్కో చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని పేర్కొన్నారు . వ్యవసాయ రంగం బలంగా ఉంటేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నారు.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్ల పంట దిగుబడులు పెరగటం, తద్వారా రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. పీఎంబీఎల్డీసి సాంకేతికత వల్ల రైతులకు వ్యవసాయ మోటార్ల పై నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని తెలిపారు. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రైతాంగంలో ఒక భరోసా ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు . వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని , రైతులకు అత్యుత్తమ సేవలు అందేలా అధికారులు ఎప్పటికపుడు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రైతులు భారీ ఎత్తున ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. వ్యవసాయానికి పగటి పూట ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా 6,663 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను ఒక ఏడాది వ్యవధి లోనే అప్గ్రేడ్ చేసేందుకు విద్యుత్ సంస్థలు చేసిన కృషిని మంత్రి అబినందించారు. దీని వల్ల ఒకే విడత లో 9 గంటల పాటు రైతులకు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు వీలు కలిగిందని తెలిపారు. తద్వారా గత రబి సీజన్లో లో రైతులు ప్రయోజనం పొందారని తెలిపారు

రాష్ట్ర ఇంధన సామర్ధ్య రంగంలో పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యoఇస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి చెప్పారు .అమెరికా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంధన సామర్ధ్య రంగంలో భారీ పెట్టుబడులతో పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తక్కువ వ్యయంతో పారిశ్రామిక ఉత్పత్తిని సాదించగలుగుతున్నారని పేర్కొన్నారు. మన విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఇంజినీర్లు కూడా పరిశోదన, నూతన ఆవిష్కరణల పై దృష్టి పెట్టాలని, తద్వారా విద్యుత్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పేందుకు కృషి చేయాలనీ కోరారు. ఇంధన సామర్ధ్య చర్యల వల్ల వ్యవసాయ రంగంలో 30 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని అంచనా ఉండగా, ప్రాథమిక దశలో కనీసం 15 శాతం ఆదా చేసినప్పటికీ , 2790 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. తద్వారా రూ 1,916 కోట్లు ఆదా చేసే అవకాశం ఉంది . ఏ పీ సిడ్కొ తో కలిసి పీఎంబీఎల్డీసి ప్రాజెక్టును చేపట్టినందుకు ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి ను ఇంధన శాఖ కార్యదర్శి అభినందించారు .

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *