Breaking News

మత్స్యకారులకు అండగా వైఎస్సార్ మత్స్యకార ప్రమాద బీమా : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం ఐదు లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు జగనన్న ప్రభుత్వంపెంపు చేసిందని, సముద్రంలో చేపలవేటకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ మత్స్యకార ప్రమాద బీమా పథకం ఎంతో అండగా నిలుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. సోమవారం  తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా మాట్లాడారు , విజయవాడ ప్రయాణిస్తూ జియో జూమ్ యాప్ ద్వారా బిగ్ స్క్రీన్ లో పలుకరించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత కృతివెన్ను మండలంలోని వర్లగొందితిప్ప గ్రామానికి చెందిన ఒక మహిళ మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పుకొంది. తన భర్త , కుమారుడు చేపల వేటకు గత ఏడాది ఏప్రిల్ 8 వ తేదీన కృష్ణా జిల్లా కృతివెన్ను మండలంలోని పెదలంక డ్రైన్లో చేపల వేటకు వెళ్లిన 8 మంది మత్స్యకారులతో పాటు గల్లంతయ్యారని వారిలో ఇద్దరు ఒడ్డుకు చేరుకోగా ఆరుగురు గల్లంతయ్యారని ఆమె తెలిపింది. వీరిలో ఐదుగురు మత్స్యకారులు కృతివెన్ను మండలంలోని వర్లగొందితిప్ప గ్రామానికి చెందిన వారు కాగా, కృతివెన్ను పంచాయతీ పల్లెపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు మత్స్యకారులు ఉన్నారని ఆమె చెప్పింది తన భర్త, కుమారుడు ప్రమాదవశాత్తు ఆరోజు మరణించారని బీమా సొమ్ము ఒకొక్కరికి 8 లక్షల రూపాయలు మాత్రమే అధికారులు ఇచ్చారని ఇరువురిపై మరో నాలుగు లక్షల సొమ్ము ఇంకా అందలేదని ఆమె మంత్రి దృష్టికి తీసుకొచ్చింది. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని ఈ విషయమై విచారణ జరుపుతానని ఆ మహిళకు జవాబు ఇచ్చారు. స్థానిక బైపాస్ రోడ్డు టెంపుల్ కాలనీకి చెందిన పలువురు మంత్రి కార్యాలయం వద్దకు వచ్చారు. తమకు ఇళ్ళ స్థలాల కోసం అధికారులు సర్వే చేసి 6 నెలలు గడిచిందని తమకు ఇంకా స్ధలాలు కేటాయించలేదని ఎం. డి. సల్మా, పెనుంబాక వరలక్ష్మి తదితరులు తమ సమస్యను చెప్పుకొన్నారు. మచిలీపట్నం మండలం శిరివెళ్లపాలెం గ్రామానికి చెందిన ముచ్చు పార్వతి మంత్రికి తన ఆరోగ్య సమస్యను చెప్పింది. తనకు కడుపులో పండు ఏర్పడిందని శస్త్రచికిత్స చేయాలనీ వైద్యులు అంటున్నారని కొంతకాలంగా తమరే ఆర్ధిక సహాయం చేస్తున్నారని , అంగవైకల్యం కారణంగా తన చేయి సరిగా పని చేయడం లేదని వికలాంగుల పింఛన్ వచ్చేలా దయచేసి సహాయం చేయాలనీ ప్రాధేయపడింది. మచిలీపట్నం మండలం గుండుపాలెం గ్రామానికి చెందిన బొద్దు బాబురావు మంత్రి వద్ద తన బాధను వ్యక్తపర్చారు. తన కుమార్తె రవి చంద్రకళను విజయవాడ సమీపంలోని తాడిగడపకు చెందిన లారీ కార్మికుడు విశ్వనాథపల్లి సముద్రాలకు ఇచ్చి వివాహం చేశానని, కొన్ని నెలల క్రితం ఆటోనగర్ లారీ షెడ్డులో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై తన అల్లుడు ప్రమాదవశాత్తు మరణించాడని, ఇద్దరు ఆడపిల్లల గల తన కుమార్తె ఎంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతుందని ఆమెకు ప్రమాద బీమా డబ్బులు వచ్చేలా సహాయం చేయాలనీ కోరాడు. స్థానిక చిలకలపూడికి చెందిన ఉమ్మిడిశెట్టి ఆనంద్ అనే యువకుడు మంత్రి వద్ద తన ఇబ్బందిని తెలిపాడు. తన ఇంట్లో కుళాయి లేదని అయితే మునిసిపాలిటీ నుంచి 17,500 రూపాయల నీటి పన్ను కట్టాలని నోటిస్ ఇచ్చారని వాపోయాడు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *