గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో ప్రజల నుండి స్పందన అర్జీలను స్వీకరించిన ఆర్డీవో శ్రీను కుమార్

-ప్రతి పౌరుడు నో మాస్క్ నో రైడ్, నో మాస్క్ నో సెల్, నోమాస్క్ నో ఎంట్రి నిబంధనలు పాటించాలి…
-మాస్కులు లేకుండా వాణిజ్య వ్యాపాలసంస్థలు విక్రయాలు జరిపితే రూ. 25 వేలు జరిమానా విధిస్తాం…
-ఆర్డీవో జి. శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ థర్డ్ వేవ్ విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నందున వాణిజ్య వ్యాపార సంస్థలు మాస్కులు లేని వారికి దుకాణాల్లో విక్రయాలు నిర్వహిస్తే అటువంటు వారిపై ప్రభుత్వం నిబంధనల ప్రకారం రూ. 25 వేలు జరిమానా విధించడం జరుగుతుందని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్ఫందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు స్పందన కార్యక్రమంలో దరఖాస్తు చేసిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలను అధికారులను అదేశించారు. డివిజన్ పరిధిలో గల ప్రజలు తమ సమస్యలపై స్పందనలో ఇచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి అర్జీదారునికి పరిష్కార పత్రాన్ని అందజేయాలని అధికారులకు సూచించారు. తమ పరిధిలో లేని ధరఖాస్తులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల వారీ అధికారులు తమ కార్యాలయానికి వచ్చిన అర్జీలను సక్రమంగా తేదీల వారీ వరస క్రమంలో రిజిష్టరు లో నమోదు చేసి అర్జీదారునికి ఆన్ లైన్ రశీదును అందజేయాలన్నారు.
గుడివాడ డివిజన్ లో కోవిడ్ కట్టడికి ప్రత్యేక డ్రైవ్ ఆర్డీవో శ్రీనుకుమార్ ఆదివారం ఒక్క రోజే డివిజన్ పరిదిలో ఎక్కువ కోవిడ్ పోజటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. డివిజన్ పరిధిలో గత నెల రోజుల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. డివిజన్ లోని గుడివాడ అర్బన్ తో పాటు నందివాడ, మండవల్లి పరిధిలో గల గ్రామాల్లో కోవిడ్ పోజిటివ్ కేసులు ఎక్కువుగా వస్తున్నందుల ఆయా గ్రామాల్లో ఫీవర్ సర్వే, వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. గుడివాడ అర్బన్ తో పాటు అన్ని గ్రామాల్లో వాణిజ్య వ్వాపార దుకాణాల్లో నోమాస్క్ నో సేల్ అనే విధంగా వినియోగదారునితో పాటు దుకాణ యజమానులు తప్పనిసరిగా మాస్కులు ధరంచాలన్నారు. ఇందుకు విరుద్దంగా ఏవరైనా కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే అటువంటి దుకాణ దారులపైరూ.25వేల రూపాయలు జరిమానా విధించాల్సిందిగా ప్రభుత్వం ఆర్డీవో, పోలీసు, మున్సిపల్ కమీషనర్లుకు అధికారం ఇచ్చిందన్నారు. మాల్స్ ఇతర వాణిజ్య సంస్థలు వారికి కేటాయించిన సమయంలో మాత్రమే వాణిజ్య, వ్యాపార సముదాయలను తెలిచి ఉంచాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందికదా అని ప్రజలు అనవసరంగా రోడ్లపై తిరగవద్దని అవసమైతేనే వెళ్ళాని ఆర్డీవో సూచించారు. జిల్లా కలెక్టరు వారి ఆదేశాలు మేరకు వారానికి మూడు రోజులు నోమాస్క్ నో ఎంట్రీ, నోమాస్క్ నో రైడ్, నోమాస్ నోసేల్ అనే విధంగా ప్రజల్లో కోవిడ్ నియంత్రణపై అవగాహన కల్పించే విదంగా డివిజన్ పరిధిలో చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ వారి పరిధిలో గలసచివాలయాలు, పీహెచ్సీలు ద్వారా వేయించుకువోలన్నారు. భౌతిక దూరం, శానిటైజర్లు వినియోగించడం వంటి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ కు దూరంగా ఉండాలని ఆర్డీవో శ్రీనుకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అర్జీలు…
గుడివాడ పట్టణ 26 వార్డు నివాసి వి.అరుణ తమ అర్జీలో నాకు గుడివాడ పట్టణంలో ఏపీ టిడ్కో గృహనిర్మాణ పథకంలో ఇల్లు మంజూరు అయ్యిందని, అయితే అలాట్మెంట్ లేటర్ లేనందున నాకు బ్యాంకులో రుణం మంజురు కాలేదు. కావున అధికారులు నాకు మంజురు అయిన ఇంటికి అలాట్ మెంట్ లేఖ ఇప్పించాలని అర్జీలో కోరారు. గుడివాడ కార్మిక నగర్ కు చెందిన షేక్ మహబూబ్ సుబాని తమ అర్జీలో నాకుతెల్ల రేషన్ కార్డు వుందని ఆదాయపు పన్ను కట్టానని రేషన్ కార్డు నిలుపదల చేశారు. ఇల్లు నిర్మాణం నిమిత్తం బ్యాంక్ లోన్ సమయంలో తాత్కాలికంగా ఆదాయం పన్ను కట్టి రశీదు బ్యాంకు వారికి చూపించాను. కాని నేను ఆదాయపు పన్నుచెల్లింపే పరిధిలో లేనని, కావున దయచేసి సంబందిత అధికారులు నాకు రేషన్ కార్డు ఇప్పించాలని వారు ఆ అర్జీలో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయపు పరిపాలనాధికారి స్వామినాయుడు, డీటీ బాలాజీ, డిప్యూటీ డీఇవో, కమలకుమారి,డిప్యూటీ ఇన్సపెక్టర్ ఆప్ సర్వే నరశింహరావు,ఇరిగేషన్, వ్యవసాయ,మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *