-జగనన్న పచ్చతోరణం, జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలి..
-కాలుష్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి..
-డిఎల్ పీవో నాగిరెడ్డి
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాల ఫలాలను గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైనవారందరికీ అందించడంతో పాటు గ్రామ పంచాయితీ పరిపాలనా వ్యవహారాలను క్షుణ్ణంగా తెలుకొనేందుకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని డివిజనల్ పంచాయితీ అధికారి నాగిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక యంపిడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గుడివాడ డివిజన్ పరిధిలో గల కైకలూరు, కలిదిండి మండలాలకు సంబందించిన గ్రామ సర్పంచ్ ల నాల్గవ బ్యాచ్ కు గ్రామ పంచాయితీ పరిపాలనపై శిక్షణా కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ డివిజన్ లో ఇప్పటి వరకు మూడు బ్యాచ్ లలో 7 మండలాలకు సంబందించి గ్రామ సర్పంచ్ లకు శిక్షణను అందించామన్నారు. నేటి నుంచి 4 వ తేదీ వరకు మూడు రోజులు కలిదిండి, కైకలూరు మండల పరిధిలో గల గ్రామ సర్పంచ్ లకు శిక్షణను అందిస్తున్నామన్నారు. మహాత్మాగాంధి కలలుకన్న గ్రామస్వరాజ్య స్థాపన కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి చేస్తున్నారన్నారు. నూతనంగా ఎన్నిక కాబడిన గ్రామ సర్పంచులు అందరూ పంచాయతీ రాజ్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో గ్రామ సర్పంచులకు నిర్వహించాల్సిన విధులు, గ్రామాభివృద్ది మంజూరైన నిధులను ఏ విధముగా ఖర్చు చేయాలి అన్నఅంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ప్రజల వద్దకే పాలనను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టినందన్నారు. అదేవిందంగా వాలెంటరీ వ్యవస్థను నియమించి ఒక్కొక్క వాలంటరీ 50 గృహాలవారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను చేకూర్చే విధంగా నియమించారన్నారు. ప్రతి సర్పంచి ఈ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ వారి గ్రామాలను అభివృద్ధి పథం వైపు నడిపించాలన్నారు. గ్రామాల్లో జగనన్న పచ్చతోరణం పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడలన్నారు. అదేవిధంగా సర్పంచ్ లుగా తాము ప్రాతినిద్యం వహించే గ్రామాల్లో జగనన్న స్వచ్చ సంకల్పం చేపట్టి కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చి దిద్దాలన్నారు.
జిల్లా మాస్టర్ ట్రైనర్ ధర్మరాజు మాట్లాడుతూ కొత్తగా ఎన్నిక కాబడిన సర్పంచ్ లు గ్రామ పరిపాలన, సమావేశాలు, సర్పంచ్ ల అధికారాలు, విధులు, భాద్యతలు, నిధులు మంజూరు, ఖర్చు, గ్రామాల్లో తాగునీరు, శానిటేషన్ గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారమన్నారు. గ్రామ పంచాయితీ సర్పంచ్ లు ఆగస్టు 15 నుంచి 100 రోజులు పాటు జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. శిక్షణా కార్యక్రమలో కలిదిండి యంపీడీవో పార్థసారధి,మాస్టర్ ట్రైనర్సు వెంకటేశ్వరారవు, శ్రావణ్ కుమార్,దిలీప్ కుమార్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.