-వివిధ సమస్యల పరిష్కరం కోసం అందిన 57 అర్జీలు
-సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్న “స్పందన” కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ సూచించారు.. సోమవారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ప్రజల నుంచి 57 అర్జీలను స్వీకరించారు. వీటిలో ఎక్కువగా మునిసిపల్ శాఖ 18,రెవెన్యూ 17 సమస్యలకు సంబంధించి వినతులు అందాయి.పంచాయతి రాజ్ 5, పౌరసరఫరాలు 3,సర్వ్ అండ్ ల్యాండ్ రికార్డ్ 2, ఆర్ అండ్ బి,వ్యవసాయ శాఖ, పబ్లిక్ హెల్త్,విద్య,సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, వైద్య తదితర శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి అందాయి. అర్జీదారులకు ఇటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా కుర్చీలు వేయించడంతో పాటు ప్రతి అర్జీదారుడు చెప్పే సమస్యలను ఓపికగా విని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. మరి ముఖ్యంగా వృద్ధుల సమస్యల పరిష్కారానికి సబ్ కలెక్టర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన వినతులను, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పారదర్శకంగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం కోవిడ్ ముప్పుపూర్తిగా తొలగిపోనందున కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. ప్రతి వారు మాస్కు ధరించి తమతో పాటు ఇతరులను కూడా కొవిడ్ బారిన పడకుండా కాపాడుకోవాలన్నారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సబ్ కలెక్టర్ స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో శ్రీనివాసరెడ్డి సంబందిత శాఖల డివిజనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.