విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత జాతీయ పతాక రూపకర్త,స్వాతంత్య్ర సమర యోధులు పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులని విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ అన్నారు. సోమవారం పింగళి వెంకయ్య 142 వ జయంతి సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో పింగళి వెంకయ్య చిత్రపటానికి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. వారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు.స్వాతంత్య్ర సమరయోధునిగా ఆయన చేసిన సేవలను మన దేశం ఎప్పుడు మరువదన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఈనెల 27 వతేదీ కి మండల కమిటీ లు పూర్తి చేయాలి…
-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి …