విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ఎక్కువ మంది చిన్న కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చడమే ద్యేయంగా, 17000 మంది కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశామని వాటిలో 95% వరకూ రూ. 50 లక్షల లోపు చెల్లింపులు పొందిన చిన్న కాంట్రాక్టర్లే ఉన్నారని, రాష్ట్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ (HR) ఒక ప్రకటనలో తెలిపారు. నీరు చెట్టు పధకం, గుంతలు లేని రోడ్ల మిషన్, నాబార్డ్ రుణాలతో చేపట్టిన పనులు, ఇతర కేటగిరీలకు చెందిన చిన్న పనుల బిల్లులను 2025 మార్చి నెలలో చెల్లింపులు చేశామన్నారు. పైన తెలిపిన పథకాలతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యాల మినహా మిగతా బిల్లులు అన్నీ (FIFO) ప్రాతిపదికన చెల్లించడం జరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల బిల్లులను C.F.M.S. ప్రాసెస్ చేసే క్రమంలో, ఆర్థిక శాఖ FIFO ప్రాతిపదికన అనుసరించడం జరుగుతుందని ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Tags vijayawada
Check Also
పీ4ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థ
-ముఖ్యమంత్రి చైర్‌పర్సన్‌గా ‘స్టేట్ లెవెల్ సొసైటీ’ -కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ‘మార్గదర్శి’లను గుర్తించాలి -పీ4 సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, …