Breaking News

పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంక్షించాలి… : ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు మానవాళి మనుగడకు ప్రాణవాయువును అందించే మొక్కలను ప్రతి ఒక్కరూ నాటి వాటిని సంరక్షించే భాద్యతను తీసుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సీనీయాక్టరు మహేష్ బాబు జన్మదినవేడుకలను పురష్కరించుకొని గుడివాడ పట్టణ మహేష్ బాబు ఫ్యాన్స్ జమదగ్ని ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఆర్డీవో కార్యాలయానికి 100 మొక్కలను ఉచితంగా అందించారు. ఈ సందర్బంగా ఆర్డీవో కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు.అనంతరం ఆర్డీవో శ్రీనుకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జగనన్న “పచ్చ తోరణం” కార్యక్రమంలో ద్వారా రాష్ట్రంలో 5 వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించే దిశగా ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం, ప్రైవేటు, ఖాలీ స్థలాల్లో మొక్కలు నాటడంతో పాటు రోడ్డులకు ఇరు వైపులా మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి ప్రాణావాయునందించేందుకు నేటి నుంచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా గుడివాడ జమదగ్ని ఫ్రెండ్స్ సర్కిల్ ప్యాన్సు వారు తమ వంతుగా వంద మొక్కలను అందించడాన్ని అభినందిస్తున్నాన్నారు. కార్యక్రమంలో గుడివాడ జమదగ్ని ఫ్రెండ్స్  సర్కిల్ ప్యాన్స్ మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

వికసిత్ భారత్ -2047 దిశగా జిల్లాలో పశుసంవర్ధక శాఖ అభివృద్ధికి కృషి చేయాలి

-జిల్లాలో పశుగణన ప్రక్రియ ను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *