Breaking News

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటి కనెక్షన్ ఇవ్వాలన్నది సీఎం జగన్ లక్ష్యం… : మంత్రి కొడాలి నాని


– గుడివాడ నియోజకవర్గానికి జల జీవన్ మిషన్ నిధులు…
– రూ.110.57 కోట్లతో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ 2024 నాటికి మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో జల జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో జల జీవన్ మిషన్ పథకం కింద రూ. 110.57 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఇదిలా ఉండగా జల జీవన్ మిషన్ ద్వారా గత ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం గృహాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లను ఇవ్వగలిగామని తెలిపారు. 2024 నాటికి సీఎం జగన్మోహనరెడ్డి పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా ఈ ఏడాది రూ. 7 వేల 251 కోట్ల నిధులతో ప్రభుత్వం ఆయా పనులను చేపట్టనుందని చెప్పారు. 2022 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 83 శాతం గృహాలకు మంచినీటి కనెక్షన్లను ఇస్తామన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఒకేసారి దాదాపు 30 లక్షలకు పైగా ఇళ్ళపట్టాలను పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తొలి దశలో 15.6 లక్షల పక్కా ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ గృహాల నిర్మాణానికి అవసరమైన నీటి వసతిని కూడా ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. జగనన్న కాలనీల్లో గృహనిర్మాణ పనులు వేగవంతం కావాలంటే నీటి సదుపాయం ఉండాలని సీఎం జగన్మోహనరెడ్డి భావించారని, దీనికనుగుణంగానే చర్యలు చేపట్టారన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా ఈ ఏడాది చేపట్టాల్సిన పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించిందన్నారు. జల జీవన్ మిషన్ నిధులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. టెండర్లు ఖరారైన వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. పనులు చేపట్టడంలో జాప్యం జరిగితే మెటీరియల్స్ ధరలు పెరిగాయనే కారణంతో కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితులు ఉంటాయన్నారు. గుడివాడ నియోజకవర్గంలో చేపడుతున్న జల జీవన్ మిషన్ పనులు సకాలంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి మూడు నెలలకోసారి జల జీవన్ మిషన్ పనులు, జగనన్న కాలనీలకు నీటి వసతి తదితరాలపై సమగ్ర పరిశీలన ఉంటుందన్నారు. జల జీవన్ మిషన్ నిధులను గుడివాడ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటామన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ఇంటింటికీ మంచినీటి కుళాయి కనెక్షన్ ను అందించడం జరుగుతుందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

Check Also

వికసిత్ భారత్ -2047 దిశగా జిల్లాలో పశుసంవర్ధక శాఖ అభివృద్ధికి కృషి చేయాలి

-జిల్లాలో పశుగణన ప్రక్రియ ను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *