Breaking News

దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేయాలి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. దివ్యాంగులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే వారు న్యాయపరమైన హక్కులను పొందవలసి ఉందన్నారు. శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దివ్యాంగుల పెన్షన్ రూ. 3000 నుండి రూ. 6000 కు పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ. 5000 నుండి రూ. 15000 వేలు కిడ్నీ, తల సేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 10 వేలు పెన్షన్ అందజేయటం హర్షనీయమన్నారు.

ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విధంగా రాజకీయంగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలలో 5% శాతం రిజర్వేషన్లను దివ్యాంగులకు కేటాయించాలన్నారు. దివ్యాంగులు అత్యాచారానికి గురికాకుండా చట్టాల్లో మార్పులు చేసి నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా చూడాలన్నారు. అంతేకాకుండా అత్యాచార బాధితులకు రూ 5 లక్షల ఎక్స్ గ్రేషియా దురదృష్టవశాత్తు మరణిస్తే రూ 10 లక్షలను అందించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో దివ్యాంగులకు ప్రత్యేక కాలనీలను ఏర్పాటు చేసి సొంత ఇళ్ళను కల్పించారని అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు ప్రత్యేకంగా కాలనీలు నిర్మించి ఇవ్వాలని కోరారు. సొంత ఇళ్లు ఉన్న దివ్యాంగులకు విద్యుత్ ,డ్రైనేజీలు, కుళాయిలు, ఇంటి పన్నుల విషయంలో 50 శాతం రాయితీ కల్పించాలన్నారు. దివ్యాంగులకు మరింత మెరుగైన ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగు పరిచి బ్యాక్ లాగ్ పోస్టులు సులభతరం చేయాలన్నారు. దివ్యాంగ దంపతులలో వైకల్యం కలిగిన వారి పేరున మాత్రమే ఇంటి పట్టా ఇవ్వాలని ఇద్దరు దివ్యంగులైతే జాయింట్ గా రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. 18 ఏళ్ళు నిండి తల్లిదండ్రులు లేని ఒంటరి దివ్యాంగులకు రేషన్ కార్డులను సులభతరం చేసి మంజూరు చేయాలని తెలిపారు. దివ్యాంగులకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని సన్మానించుకొనే అవకాశం కల్పించాలని ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి నూర్ అహ్మద్, మహిళా కార్యదర్శి ఎస్ ఉమా మహేశ్వరి , మహిళా కార్యదర్శి నాగలక్ష్మి, బోయి ఎల్లారావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *