ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా ఆదివారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ పరిపాలనా కార్యాలయం, జమ్మిదొడ్డి నందు నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచ్చేయగా ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఎస్ పి ఎఫ్ సిబ్బంది, హోంగార్డ్స్ మరియు ఆలయ రక్షణ సిబ్బంది వారి వందనం అందుకున్నారు. అనంతరం మంత్రి, ఆలయ చైర్మన్ , కార్యనిర్వహణాధికారి మరియు పాలకమండలి సభ్యులు అమ్మవారి, భారతమాత, జాతిపిత మహాత్మాగాంధీ వారి చిత్ర పటాలకు ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు మరియు అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూలు, పండ్లు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరము మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, చైర్మన్, కార్యనిర్వహణాధికారి, పాలకమండలి సభ్యులు మరియు సిబ్బంది జాతీయ జెండా వందనము జేశారు. తదనంతరము మంత్రి, చైర్మన్ , కార్యనిర్వహణాధికారి స్వాతంత్ర్య దినోత్సవ విశిష్టత గురించి, స్వాతంత్రోద్యమ నాయకుల గొప్పదనం గురించి ప్రసంగించారు. అనంతరం చిన్నారులకు, ఎస్ పి ఎఫ్, సెక్యూరిటీ మరియు దేవస్థానము సిబ్బందికి ఆలయ పాలకమండలి చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయ కార్యనిర్వహనాధికారులు, పర్యవేక్షకులు, పొలిసు సిబ్బంది , ఇంజినీరింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, మరియు ఇతర దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
Tags indrakiladri
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …