Breaking News

75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు వారి కార్యాలయం తమ్మిన గురవమ్మ సత్రం వద్ద వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండాను ఎగురవేసి జెండా వందనం చేసిన అనంతరం జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ భారతదేశ దాశ్యశృంఖలాలను విడిపించి, దేశప్రజలకు స్వేచ్చా, స్వాతంత్ర్యం ప్రసాదించడంకోసం ఎందరో మహానుభావులు వారి ఆస్తులను, ధన, మాన, ప్రాణాలను త్యాగం చేయబట్టే నేడు మనకు ఈ స్వాతంత్ర్య ఫలాలు అందాయని, వారి త్యాగాలఫలితం భారతభూమికి, ప్రజలకు స్వాతంత్య్రం సిద్దించి నేడు 75 సంవత్సరములు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ వజ్రోత్సవ వేడుకలును దేశ ప్రజలందరూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని, రాబోయే రోజుల్లో దేశం మరింతగా అభివృద్ధి చెందింది 100% అక్షరాస్యత సాధించాలని నిరుద్యోగులు లేని, అవినీతి రహిత దేశంగా ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నామని, ఒలంపిక్స్ లో పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన విజేతలకు ప్రత్యేక అభినందనలు మహేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూనె సోమశేఖర్, పి. శ్రీను వెన్న శివ శంకర్, శనివారపు శివ, మురళి కృష్ణ, రమాదేవి, మోబిన, షహీన్ , భవాని, నరేష్, కూర్మా రావు, మురళి, తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *