విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య దినోత్సవ స్పూర్తిగా దేశ సమైక్యత, సమగ్రతలకు మరింత కృషి చేసి అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ఈ శుభ సమయాన దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు అర్పించిన మహనీయులను, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిద్దామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ స్పూర్తిగా అభివృద్ధి వైపు ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం సిద్ధించి 2022 ఆగస్టు 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆనాటి స్వాతంత్ర్య స్ఫూర్తి పెంపొందించేందుకు ఏడాది పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారికి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మెమోంటోలను ప్రశంసా పత్రాలను బహుకరించారు. కార్యక్రమంలో ఏఓ ఎ.శ్రీనివాస్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …