ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం…


-వైద్య సంస్థలకు ప్రభుత్వ సహకారం
-అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో ఆసుపత్రిని స్థాపించడం శుభపరిణామం
-అను మై బేబీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)
-‘అను మై బేబీ’ ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రసూతి, నవజాతశిశు వైద్య సేవలు
-అను హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ గాజుల రమేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో అను మై బేబీ హాస్పిటల్ ను స్థాపించడం శుభపరిణామం అని ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు. ప్రసూతి, నవజాత శిశు వైద్య సేవలకు సంబంధించి అను హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎనికేపాడులో స్థాపించబడిన ‘అను మై బేబీ’ హాస్పిటల్ ను ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరిరావు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్న వైద్య సంస్థలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని అన్నారు. అనంతరం అను హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ గాజుల రమేష్ మాట్లాడుతూ క్లిష్టమైన ప్రసూతి కేసులు, నవజాత శిశు వైద్య చికిత్సలు అందించేందుకు అను మై బేబీ హాస్పిటల్ ను తీర్చిదిద్దామని అన్నారు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో అధునాతన వైద్య సేవలను అందిస్తామని అన్నారు. అను మై బేబీ హాస్పిటల్ నందు హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నియోనేటల్ కేర్, చైల్డ్ కేర్, న్యూబోర్న్ కేర్, ఎమర్జెన్సీ చికిత్సలతో పాటు వ్యాక్సినేషన్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఔట్ పేషేంట్, ఇన్ పేషేంట్ వైద్య సేవలు, మెటర్నల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ డివిజన్, హై డిపెండెన్సీ యూనిట్, లేబర్ వార్డుతో అనుసంధానితమైన ఎమర్జెన్సీ థియేటర్, నిరంతరం అందుబాటులో ప్రసూతి వైద్యులు, మత్తు నిపుణులు, వ్యక్తిగత సహాయ సిబ్బంది, ప్రసవానంతర వైద్య సేవలు, ప్రెగ్నెన్సీకి సంబంధించిన విస్తృతమైన స్కానింగ్, అత్యాధునిక లాబొరేటరీ తదితర అత్యాధునిక సదుపాయాలతో అను మై బేబీ సేవలందిస్తుందని డాక్టర్ జి.రమేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.శ్రీదేవి, డాక్టర్ దుర్గానాగరాజు, డాక్టర్ ఎస్.కిరణ్ కుమార్, అను హాస్పిటల్ డైరక్టర్లు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *