Breaking News

భూసర్వే వినియోగంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్స్ బేస్ స్టేషన్ ను సందర్శించిన కేంద్ర బృందం..


-కేంద్ర బృందానికి స్వాగతం పలికిన సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ది చెందిన సాంకేతికతతో చేపట్టిన స్వామిత్వా (SVAMITVA) సర్వే తీరును పరిశీలించేందుకు జిల్లాలో కేంద్ర బృందం బుధవారం పర్యటించింది. నగరంలోని విజయవాడ రూరల్ యంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్స్ బేస్ స్టేషన్ ను కేంద్ర బృందానికి చెందిన పిఆర్ కేంద్ర మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ ప్రేమ్ నగర్ , స్వామిత్వా ఛైర్మన్ లెఫ్ట్ నెంట్ గిరీష్ కుమార్ లు సందర్శించారు. వీరివెంట సర్వే అండ్ సెటిల్ మెంట్స్ కమిషనరు సిద్ధార్ధ జైన్, విజయవాడ సబ్ కలెక్టరు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, జిల్లా పరిషత్తు సిఇఓ సూర్యప్రకాష్, తహశీల్దారు బి.సాయిశ్రీనివాస్ నాయక్, సర్వే ఇన్స్ పెక్టర్ ఏవియస్. ప్రసాద్ లు ఉన్నారు. తొలుత కేంద్ర బృందానికి చెందిన జాయింట్ సెక్రటరీ అలోక్ ప్రేమ్ నగర్ , స్వామిత్వా ఛైర్మన్ లెఫ్ట్ నెంట్ గిరీష్ కుమార్ లకు సబ్ కలెక్టరు ప్రవీణ్ చంద్ పూలకుండీలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈసందర్భంగా సంబంధిత అధికారులు కేంద్ర బృందానికి వివరాలు అందిస్తూ రాష్ట్రంలో 70 కార్స్ బేస్ స్టేషన్లు ఏర్పాటు అయ్యాయన్నారు. ఇవి 24/7 గంటలూ పనిచేస్తాయన్నారు. రాష్ట్రంలోని గ్రామాల్లో వైయస్. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష క్రింద సర్వేలో వీటి వినియోగం ఎ ంతో ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు. బేస్ స్టేషన్ లో జిజియస్ రిసీవర్లు నిరంతరం నడుస్తాయన్నారు. సర్వర్ లో నడుస్తున్న బేస్ స్టేషన్ సాఫ్ట్ వేర్ రిసీవర్లను నియంత్రిస్తుందని, డేటా ఫైళ్లను క్రమవ్యవధిలో స్వయం చలకంగా డౌన్ లోడ్ చేస్తుందన్నారు. స్వీయకర్తలు డేటాను లాగిన్ చేయడానికి బదులుగా ముడి డేటాను నిరంతరం సర్వర్ కు ప్రసారం చేయవచ్చునని లేదా వారు డేటాను లాగిన్ చేస్తున్నప్పుడు అదే సమయంలో ముడి డేటాను ప్రసారం చేయవచ్చన్నారు. బేస్ స్టేషన్ల ఆధారంగా శాటి లైట్ లింక్ ద్వారా రోవర్లను వినియోగిస్తూ ఖచ్చితత్వమైన సర్వేను నిర్వహించేందుకు వీలు ఉందన్నారు. ఈసందర్భంగా వర్కింగ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కార్స్ నెట్వర్క్ గురించి కేంద్ర బృందానికి సంబంధి తాధికారులు వివరించారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *