-ఇందుకు సంబంధించి రూ. 12.5 కోట్లు పెనాల్టీ విధించనున్నాం…
-2013 నుండి 2019 జనవరి వరకూ ఆండ్రూమినరల్ కంపెనీ మైనింగ్ పై విచారణ చేపట్టాం…
-5 రీజనల్ విజిలెన్స్ బృందాలు విచారణ నిర్వహిస్తున్నాయి…
-ఆ డ్రోన్ ద్వారా కూడా సర్వే నిర్వహిస్తున్నాం…
-లేట రైట్ త్రవ్వారా? బాక్సైట్ త్రవ్వారా? అనే దాని పై కూడా విచారణ చేపట్టాం…
-పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది
-గనులు భూగర్భజల శాఖ డైరెక్టరు వి.జి. వెంకట రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టామని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి , గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణద్వివేది అన్నారు. విజయవాడ రోడ్లు భవనాలు శాఖ కార్యాలయంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, గనులు, భూగర్భజలశాఖ డైరెక్టరు వెంకట రెడ్డిలు ప్రభుత్వం తీసుకున్న చర్యలను బుధవారం పాత్రికేయుల సమావేశంలో వివరించారు.
ఈసందర్భంగా గోపాలకృష్ణద్వివేది మాట్లాడుతూ గనులశాఖ పలువిచారణ చేపట్టిందని విచారణ పూర్తయిన అనంతరం సంబంధిత కంపెనీ తగు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తప్పు ఎవరు చేసినా ప్రభుత్వం తగ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ఈకంపెనీతో మైనింగ్ శాఖ ఉద్యోగులు లాలూచీ పడినట్లు విచారణలో తేలితే అటువంటి వారిపై కూడా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆండ్రూ మినరల్స్ కంపెనీకి 2013 లో 8 లీజులు మంజూరు చేసారని, ఈకం పెనీ పై పలు ఫిర్యాదులు అందిన మీదట గనుల శాఖ స్పందించి మొత్తం లీజులపై విచారణ చేపట్టిందని అన్నారు. ఇందుకు సంబంధించి విజిలెన్స్ బృందాలు ఏర్పాటుతోపాటు ప్రభుత్వ నిబంధన ఉల్లంఘన పై కూడా విచారణ చేపట్టామన్నారు. 2 లక్షల టన్నులు లేటరైట్ అక్రమత్రవ్వకాలు జరిగాయని ప్రాధమిక విచారణలో తేలిందని, భద్రతాచర్యలు, ఇతరప్రమాణాలను కూడా తనిఖీ చేస్తున్నామన్నారు. గతంలో జరిగిన ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టామని, గతంలో పనిచేసిన అధికారుల పాత్ర కూడా ఉందని, వారిపై కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తిస్థాయి నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని గోపాలకృష్ణద్వివేది అన్నారు.
గనులు భూగర్భజల శాఖ డైరెక్టరు వి.జి. వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆండ్రూ మినరలకు 8 లీజులు ఇచ్చామని, 2013 లోనే ఈకంపెనీకి 8 లీజులు మంజూరు చేయుట జరిగిందని ఆయన అన్నారు. ఈకం పెనీపై వచ్చిన ఫిర్యాదులకు ప్రభుత్వం స్పందించి తగు విచారణ చేపట్టామని వెంకటరెడ్డి అన్నారు. 2 లక్షల టన్నులు లేటరైట్ అక్రమంగా త్రవ్వకాలు జరిగాయని గుర్తించామని దాని పై పెనాల్టీ విధిస్తామని ఆయన అన్నారు. ఈకంపెనీ భద్రతా చర్యలు, ఇతర ప్రమాణాలను కూడా తనిఖీ చేసామని ఆయన అన్నారు. వేదాంత కం పెనీకి 34 లక్షల టన్నుల లేటరైట్ సరఫరా చేసారని, 4.5 లక్షల టన్నులు చైనాకు కూడా ఎగుమతి చేసారని, వీటి పై కూడా విచారణ జరుపుతున్నామని వెంకట రెడ్డి అన్నారు. లేట రైట్ త్రవ్వారా? బాక్సైట్ త్రవ్వారా? అనే దాని పై కూడా విచారణ చేపట్టామని అన్నారు. లేట రైట్ సిమెంటు కంపెనీలకు సరఫరా చేస్తారని కానీ అల్యూమినియం కంపెనీలకు సరఫరా చేయడాన్నిబట్టి బాక్సైట్ సరఫరా చేసారా? అనేది విచారిస్తున్నామని ఆయన అన్నారు. 2013 నుండి 2019 జనవరి వరకూ ఆండ్రూమినరల్స్ కంపెనీ చేపట్టిన మైనింగ్ పై పూర్తి విచారణ చేపడుతున్నామని ఆయన అన్నారు. ఈలీజుకు సంబంధించి హద్దులు పాటించారా? భద్రతా చర్యలు చేపట్టారా? లీజు ప్రకారం మైనింగ్ చేపట్టారా? మైనింగ్ ప్లాన్ ప్రకారంగా కంపెనీ మైనింగ్ చేపట్టిందా? లేదా? అనే విషయాలపై విచారణ చేపట్టారని ఇందుకు సంబంధించి ఆర్ వియస్ టీమ్ లను నియమించామని, ఫారెస్ట్ ఏరియాలో కూడా సర్వే చేపడుతున్నామని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి 5 రీజనల్ విజిలెన్స్ బృందాలను ఏర్పాటుచేశామని ఆయన అన్నారు. ఈ బృందాలు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేది అందించనున్నాయని ఆయన తెలిపారు. అటవీ చట్టం ప్రకారం ఫారెస్ట్ ఏరియాలో మైనింగ్ చేపట్టారా? అనే విషయాన్ని కూడా విచారణ చేపడుతున్నామని, డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
రాష్ట్రంలో 60 లక్షల టన్నుల ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచామని ఎటువంటి ఇసుక కొరత లేదని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. రాష్ట్రంలో మొత్తం 130 స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుకను ప్రజలకు సరఫరా చేస్తున్నామని, ప్రభుత్వం ఇసుక రేట్లను పెంచ లేదని టన్ను రూ. 475 రూపాయలకే అందిస్తున్నామని ఆయన అన్నారు. డీజిల్ రేట్లు పెరిగినకారణంగా రవాణా ఛార్జీలు పెంచమని కోరుతున్నారని ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ఏడిపోలో ఎ ంత రేటు ఉన్నదనేది ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఇసుక అక్రమరవాణాపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని అటువంటి కేసులపై సెబ్ తగు చర్యలు తీసుకుంటుందని గోపాలకృష్ణద్వివేది అన్నారు. ఇసుక అమ్మకంధర మారదని, రవాణా ఛార్టీలు మాత్రం మారతాయని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు.