Breaking News

స్వామిత్వా ద్వారా పారదర్శకంగా భూలావాదేవీలు : కేంద్ర పంచాయితీరాజ్ జాయింట్ సెక్రటరీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వామిత్వా ద్వారా దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అవినీతికి తావు లేకుండా భూలావాదేవీలు, ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య ,భూయజమానులకు తమ భూములపై వేరె ఎవరూ సవాల్ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు కల్పించడం ద్వారా భూవివాదాలకు స్వస్తి చెప్పినట్లువుతుదని కేంద్ర పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అలోక్ ప్రేమ్ నగర్ స్పష్టం చేశారు.
బుధవారం మధ్యాహ్నం కేంద్ర పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యుల బృదం మచిలీపట్నం మండలం పొట్లపాలెం గ్రామంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన స్వామిత్వా ( సర్వే అఫ్ విలేజస్ ఆబడి అండ్ మాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా ) కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి పంచాయితీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక శతాబ్ధకాలం తర్వాత సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సర్వే ఆఫ్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు. కొన్నిచోట్ల కొందరికి సంబంధించిన రికార్డుల్లో భూమి ఒక చోట ఉంటే, వారు అనుభవిస్తున్న భూమి మరో చోట ఉండడం జరుగుతుందన్నారు, ఇలాంటివన్నీ స్వామిత్వా ద్వారా సరి చేయబడతాయిని దీంతో భూమి సబ్ డివిజన్ సమస్యలు కూడా తొలగిపోతాయిని చెప్పారు. దాంతో ఆస్తి, క్రయ, విక్రయ, తనఖా, దాన, వారసత్వ, ఇతర లావాదేవీలు వివాదరహితం అవుతాయిని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆయా ప్రక్రియలు సులభతరం అవుతాయిని రిజిస్ట్రేషన్ కూడా గ్రామంలోనే చేసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.
తొలుత గ్రామ సభల ద్వారా సర్వే విధానం, షెడ్యూలు, ప్రయోజనాలు వివరిస్తారని ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి, సర్వేయర్లతో కూడిన బృందాలు సర్వే నిర్వహిస్తాయిని వివరించారు.డ్రోన్, కార్స్, రోవర్ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్తిని కచ్చితమైన భూ అక్షాంశ – రేఖాంశాలతో గుర్తించి కొత్తగా సర్వే, రెవెన్యూ రికార్డులు రూపొందించబడతాయన్నారు ప్రతి యజమానికి నోటీసు ద్వారా ఆ సమాచారం అందజేస్తారని వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, గ్రామ సచివాలయంలోని గ్రామ సర్వే బృందాల ద్వారా అప్పీలు చేసుకుంటే, అవి సత్వరం పరిష్కారం అయ్యేలా ప్రతి మండలంలో మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు ఏర్పాటు జరిగిందన్నారు. ఈ సర్వే పూర్తైన తర్వాత ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇస్తారని రెవెన్యూ రికార్డులు, ఇతర వివరాలు గ్రామాల్లో డిజిటల్ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయిని కేంద్ర పంచాయితీరాజ్ జాయింట్ సెక్రటరీ అలోక్ ప్రేమ్ నగర్ విపులీకరించారు.
కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, పొట్లపాలెం గ్రామంలో 570 ఎకరాలలో రీ సర్వే జరిగిందని రీ సర్వే కు ముందు మొత్తం సర్వే నంబర్లు 150 ఉంటె , రీ సర్వే తర్వాత ల్యాండ్ పార్సెల్ మ్యాప్ (ఎల్పీఎం) సర్వే నంబర్లు 654 వచ్చినట్లు తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న రికార్డుల స్వచ్ఛీకరణ జరగడమే కాక వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం రికార్డులు ఉచితంగా సర్వే జరుగుతుందని ఆ తర్వాత ఉచితంగా వైయస్సార్ జగనన్న భూరక్ష హద్దురాళ్లు ఏర్పాటు చేస్తామని దీని వల్ల సరిహద్దు వివాదాలకు స్వస్తి పలికినట్లవుతుందని జె సి చెప్పారు.
అనంతరం పొట్లపాలెం గ్రామ సర్పంచ్ గాజుల నాగరాజు మాట్లాడుతూ, తమ తాతల కాలంలో వందేళ్ల క్రితం రెవిన్యూ రికార్డులు బ్రిటిష్ వారు తయారుచేసేరని అవే నిన్నా మొన్నటివరకు కొనసాగేయని, గ్రామ కంఠాల భూముల్లో పొలాలకు సరైన పత్రాలు లేకపోవడంతో బ్యాంకుల నుండి రుణం పొందలేక పలువురు రైతులు ఎన్నో అగచాట్లు పడ్డారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ స్వామిత్వా పథకం, రాష్ట్ర పథకం చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం ఎందరో రైతన్నలకు తమకు స్వంత భూమి పట్టా రూపంలో లభ్యమవుతుందనే ఆశలు కలిగించాయని ఇందుకు ఎంతో కృషి చేసిన అధికారులకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర బృంద సభ్యులు స్వామిత్వా మానిటరింగ్ అండ్ హ్యాండ్ హోల్డింగ్ కమిటీ ఛైర్మెన్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ , సర్వే అండ్ సెటిల్మెంట్ కమీషనర్ సిద్ధార్థ జైన్, పంచాయితీరాజ్ రాష్ట్ర కమీషనర్ ఎం.గిరిజా శంకర్, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత , ల్యాండ్ అండ్ రికార్డ్స్ ఏ డీ సూర్యారావు, జిల్లా పంచాయితీ అధికారిణి ఏ.డి. జ్యోతి, జిల్లా పరిషత్ సి ఇ ఓ సూర్యప్రకాష్ , డ్వామా పిడి సూర్యనారాయణ , మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, డి ఎల్ పి ఓ. ఐ. జ్యోతిర్మయి, మచిలీపట్నం తహశీల్ధార్ సునీల్ బాబు, ఆర్ ఐ లు యాకూబ్, వనజాక్షి పొట్లపాలెం గ్రామ కార్యదర్శి నాగజ్యోతి, బోయిన నాగబాబు, గాజుల మాధవ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *