కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయంకృషితో అతి సామాన్య స్థాయినుండి శాసనసభ్యునిగా ఎదిగి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే డిఎన్ఆర్ తత్వం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు.
మంగళవారం కలిదిండి మండలం భాస్కరరావుపేట గ్రామంలో రూ. 40 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన, నూతన సచివాలయ భవనాన్ని, మూల ఉప్పరగూడెం లో రూ.21.08 లక్షల వ్యయంతో నిర్మించబడిన నూతన రైతు భరోసా కేంద్రాన్ని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా యంపీ శ్రీధర్ మాట్లాడుతూ ఈరోజున బాస్కరరావుపేట గ్రామ సర్పంచ్ గద్దే ఆనంద్ కుమార్, అల్లూరి ఎస్ఐ రాజు గారి ఆధ్వర్యంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా వుందన్నారు.,కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కృషితో ప్రతి పంచాయతీలో నూతన భవనాలు నిర్మించుకోవడం,ఏదైనా పని పట్టుకుంటే అవిశ్రాంతంగా ఆ పని పూర్తి అయ్యేవరకు శ్రద్ధ చూపించి పనిచేయడం డిఎన్ఆర్ నైజం అన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఇంత ప్రజారంజక పాలన చేస్తున్న జగనన్నకు మరోసారి 150 పై చిలుకు సీట్లు రావడం ఖాయం అని అన్నారు. మీ మీ ప్రాంతాల్లో గత శాసనసభ్యుల అనుచరులుగా తిరిగిన నాయకుల్ని ప్రశ్నించి నిలదీయాల్సిన అవసరం ప్రతి పథక లబ్ధిదారునికి ఉందన్నారు. స్వాతంత్ర్య భారత చరిత్రలో రైతు కోసం నూటికి నూరుశాతం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అన్నారు. రైతు పంట వేయడానికి ముందు నుంచిపండించిగిట్టుబాటు ధరకు అమ్ముకునేంత వరకు అడుగడుగునా అండదండగా ఉండి గ్రామంలోనే రైతుల అన్ని అవసరాలు తీర్చేవిధంగా రూపకల్పన చేసిన వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థ అన్నారు.
శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, అన్నదమ్ములు, అక్కచెల్లమ్మలు, పార్టీ నాయకులు, గ్రామ ప్రముఖులు ఆధ్వర్యంలో మనం 40 లక్షలు రూపాయలు నిధులతో ఈ రోజు ప్రారంభించుకున్నామన్నారు. గత పాలకుల వలే మాటలు చెప్పే ప్రభుత్వం కాదుని, మాట ఇచ్చాము అంటే మాటకు కట్టుబడి పని చేసే మన జగనన్న ప్రభుత్వంలో పని చేస్తున్నామని, ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి, ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులు ఇచ్చి, పరిపాలన భవనాలు నిర్మాణలు చేసుకుంటున్నామని, ముఖ్యంగా ప్రజలకు పరిపాలన నేరుగా అందించాలని, వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, స్థాపించి, ప్రతి 50 ఇండ్లకు నేరుగా పరిపాలన అందిస్తున్నారన్నారు. అర్హులు అయిన ప్రతి అక్కచెల్లమ్మలకు సంక్షేమ పధకాలు అందిస్తూ,, తేదీల వారీగా వారి వారి బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారు అని అన్నారు. ప్రజలు మా పైన ఉంచిన నమ్మకానికి ప్రతి నిమిషం ప్రజల సంక్షేమ కోసం పని చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఆర్థిక ఇబ్బందులు గురి చేసిన మన ముఖ్యమంత్రి వైఎస్. జగనన్న ఎక్కడ కూడా ఏ సంక్షేమ పధకం ఆగకుండా తేదీల వారీగా నవరత్నాలను అందిస్తున్నారన్నారు.
కార్యక్రమంలోపీఆర్ డీఈఈ సురేష్, తాహశీల్థారు శర్మ, ఎంపీడీఓ పార్ధసారధి,ఈవోపీఆర్డీ శ్రావణ్, సెక్రటరీ శివన్నారాయణ, AMC చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, ఎంపీపీ అభ్యర్థి చందన ఉమామహేశ్వరరావు,మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఐనాల బ్రహ్మజీ, నంబూరి శ్రీదేవి, పోకల కోటేశ్వరరావు, సాన మీనా సరస్వతి, ఊర శ్రీధర్, మోకా రామకృష్ణ, నున్న కృష్ణబాబు, గండికోట ఏసుబాబు, బత్తిన ఉమా, ఎంపీటీసీ చవాకులు పద్మ, ఇమ్మానేని లక్ష్మణరావు, అల్లూరి కృష్ణంరాజు, అల్లూరి గోపిరాజు,, పెద్దింటి ఏరబాబు, పోసిన భరత్,పడవల శ్రీనివాస్, చిట్టూరి బుజ్జి, పోట్రు నాగన్న, నున్న రామచంద్రరావు,చెన్నంశెట్టి సోమేశ్వరరావు, తట్టిగోళ్ల నాంచారయ్య, ద్రోణాది ఫ్రాన్షిస్, పోనిపిరెడ్డి శ్రీనివాసరావు, కోకా తాతాజీ, దుగ్గిరాల రంగారావు, తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, ముద్దం రామకృష్ణ, కోకా ఏకో నారాయణ, కొల్లాటి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Tags kalidindi
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …