కైకలూరు,నేటి పత్రిక ప్రజావార్త :
ఏ నమ్మకంతో అయితే ప్రజలు మనకి ఓటు వేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే దిశగా పనిచేయవలసిన బాధ్యత ప్రతి ప్రజా ప్రతినిధిపై ఉందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. మంగళవారం శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు , కైకలూరుసర్పంచ్ డీఎం నవరత్నకుమారితో కలిసి కైకలూరు పట్టణంలో రూ.25 లక్షల ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో నిర్మించిన 1 వ సచివాలయం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ కైకలూరు పట్టణంలో శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు సచివాలయ భవనం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి పరిపాలనలో ప్రజలకు పరిపాలన నేరుగా అందించాలని, నిర్మించే ప్రతి భవనం కార్పిరేట్ స్థాయిలో నిర్మితం అవుతున్నాయన్నారు. వాలంటరీ, సచివాలయం, వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించడం జరుగుతుందన్నారు.పరిపాలన అంటే పథకాలు ఇవ్వడమే కాదని, ప్రజల్లో అడిగే హక్కును కల్పించి, పరిపాలన ప్రతి ఒక్కరికీ అందేలా చేసి ఆసక్తిని కలిగించడం అన్నారు. ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గం లో శాసనసభ్యులు బాగా పనిచేస్తున్నారన్నారు.
శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న ఆశీస్సులుతో ఈ రోజు మనం సచివాలయం భవనాలు ప్రారంభించుకుంటున్నామన్నారు. ప్రజాసంకల్పపాదయాత్రలో, ప్రజల కష్టాలను నేరుగా, చూసి, విని, మనం అధికారంలోకి రాగానే, నవరత్నాలను ప్రవేశపెట్టి, ప్రజలకు పరిపాలన నేరుగా అందిస్తున్నారు. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ప్రతి సంక్షేమ పధకం కూడా లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నారన్నారు.ప్రభుత్వం అధికారం చేపట్టిన 2 ఏళ్లలోనే కైకలూరు పంచాయితీ పరిధిలో రూ.63 కోట్ల 77 లక్షల 54 వేల 821 నిధులు వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు వెచ్చించడం జరిగిందన్నారు.దీనితో పాటుగా కైకలూరు ఏలూరు రోడ్ లో నిర్మితమవుతున్న వై.ఎస్.ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ కోసం ప్రభుత్వం 167 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీ అంటేనే సమస్యల పుట్ట అని, చిన్న చిన్న సమస్యలు వార్డుసభ్యులు సర్పంచ్, ఈఓ ల దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసి పేరు తెచ్చుకోవాలని అన్నారు.ఒక్క కైకలూరు నియోజకవర్గంలోనే 12 వేల మంది అక్కచెల్లమ్మలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామన్నారు. కైకలూరు పట్టణంలో ఏలూరు రోడ్డు హైవే అనుకోని 3000 మంది అక్కచెల్లమ్మలకు ఇంటి పట్టాలు ఇచ్చామన్నారు.
కార్యక్రమంలో పీఆర్ డీఈఈ పగడాల సురేష్,తాహశీల్థారు సాయికృష్ణకుమారి, ఎంపీడీఓ వెంకటరత్నం,కరెంట్ ఏడీఇ బసవరాజు, ఏఈఈ భాస్కర్,ఈవో లక్ష్మినారాయణ,పీఆర్ ఏఈఈ బాషా,కాంట్రాక్టర్ తోట నరసింహమూర్తి, వైస్ సర్పంచ్ మంగినేని పోతురాజు, జడ్పీటీసీ కురేళ్ళ బేబీ, ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, నిమ్మల సాయి,, సయ్యద్ బాషా,చెరుకువాడ బలరామరాజు, అబ్దుల్ హమీద్, తలారి జాన్ విల్సన్,పెద్దింటి పెద్దిరాజు, వార్డ్ మెంబెర్స్, షేక్ అమ్మనా కౌసర్, సమయం అంజిబాబు, గిరి కన్యాకుమారి, పిచ్చుకుల సుధారాణి, పిచ్చుకుల శివారమ్య, బిరుదుగడ్డ రాజమణి, తోట మహేష్, యండీ గాలిబ్ బాబు, గూడపాటి విజయశేషు, రెహానా కౌతారు, కేవీఎన్ యం నాయుడు, బెల్లాని శ్యామలరావు, పెద్దింటి మురళీ, సమయం శ్రీను, గునిపూడి జ్యోతి, మూడెడ్ల శ్యామల, మేడూరి నాంచారయ్య, మంచికంటి శ్రీనివాసరావు, నాయకులు కూనవరపు సతీష్, కటికన రఘు, బిరుదుగడ్డ లాజర్,దండే రవిప్రకాష్, బోడిచర్ల సురేష్, సోమల శ్యామ్ సుందర్, గూడపాటి జగన్నాధం,నాసర్, పళ్ళ సాయి,వాలంటరీలు, సచివాలయం ఉద్యోగులు, పంచాయతీ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News