Breaking News

ప్రతిభతోపాటు అర్హత ప్రాధాన్యత…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కడప స్పోర్ట్స్ స్కూల్ లో 4, 5 తరగతుల అడ్మిషన్ల భర్తీకి సంబంధించి జిల్లాల నుండి రాష్ట్ర స్థాయిలో జరుగు ఎంపికలో పాల్గొనుటకు 136 (బాల బాలికలు) అర్హత సాధించారు. వారిలో 125 (బాల బాలికలు) రాష్ట్ర స్థాయి ఎంపికకు హాజరయ్యారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి ఎంపికలను శాప్ చైర్మన్ రవినాయుడు ఈరోజు ప్రారంభించి ఎంపికల ప్రక్రియను శాప్ డైరెక్టర్లు ఏ.రమణారావు, పి. రవీంద్రనాధ్, శాప్ ఏవో వెంకటరమణ నాయక్, యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పాల్ కుమార్ తో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ పారదర్శకంగా, సమర్థవంతంగా ఎంపికల ప్రక్రియ చేపడుతున్నామన్నారు. శారీరక, మానసిక దారుఢ్యంతోపాటు క్రీడాకారులుగా రాణించాలనుకునేవారిని ఎంపిక చేయడమే అజెండా అన్నారు. ప్రతిభతోపాటు అర్హత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. సిఫారసులు, ప్రోద్భలాలకు అతీతంగా విద్యార్థుల ఎంపిక జరుగుతోందని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *