Breaking News

చిత్తూరు, పలమనేరు, మదనపల్లి డివిజన్ లలో రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

-రాష్ట్రఆర్ అండ్ బి శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి

పలమనేరు, నేటి పత్రిక ప్రజావార్త :
చిత్తూరు, పలమనేరు, మదనపల్లి డివిజన్ లలో రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలి అనిరాష్ట్రఆర్ అండ్ బి శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పలమనేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రివర్యులు పాల్గొన్నారు. అనంతరం పలమనేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు జిల్లా ఆర్ అండ్ బి అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే N. అమర్నాథరెడ్డి డిసిసి బ్యాంక్ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ
చిత్తూరు ,మదనపల్లి, పలమనేరు డివిజన్ పరిధిలో MDR, SH, నాబార్డ్ కింద మంజూరైన రహదారి అభివృద్ధి పనులను త్వరితగతిన టెండర్ ప్రక్రియను పూర్తిచేసి, 6 నెలలలోపు రహదారి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.పలమనేరు నియోజవర్గంలో మంజూరు అయిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
పలమనేరు నియోజకవర్గం పరిధిలో అటు తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల మధ్య ఉన్న రహదారుల అభివృద్ధి కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకురాగా, ఇంటర్ స్టేట్ ఫండ్స్ నిధుల మంజూరు కొరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.అదే సమయంలో ఇంటర్ స్టేట్ ఫండ్స్ కొరకు ప్రణాళిక రచించి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు100% పాట్ హోల్స్ ఫ్రీ కింద మంజూరైన పనులు పూర్తయినట్లు మంత్రికి అధికారులు తెలియజేశారు.. పెండింగ్ బకాయిలుకాంట్రాక్టర్లకు చెల్లించాలని మంత్రి దృష్టి తీసుకురాగా పరిష్కరిస్తామని తెలియజేశారు.రహదారుల నాణ్యతవిషయంలోరాజీపడవద్దని, అందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆర్ అండ్ బి శాఖకు మంచి పేరు తీసుకొచ్చేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *