Breaking News

సచివాలయం సిబ్బంది పింఛన్లు క్రమం తప్పకుండా ప్రతి నెల లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలి

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా…ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్ళి క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.

శుక్రవారం సూళ్లూరుపేట ఇరకం గ్రామo నందు ఎంఎల్ఏ నెలవెల విజయశ్రీ తో కలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల ను లబ్ధిదారుల వద్దకు వెళ్లి పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు. ఆగస్టు నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల ను 2,63,743 మంది ఫించన్ దారులకు సుమారు 113.15 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ లబ్బిదారులకు పెన్షన్ లను అందజేస్తూ పెన్షన్లు అందిస్తున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతినెల ఒకటవ తేదీన మీ ఇంటి వద్ద కు వచ్చి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారా అని లబ్ధిదారులను అడిగారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటి వద్దకు వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని ఫించన్లు తమకు ఆర్థికంగా భరోసా ఉందని కలెక్టర్ కు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్ డి ఓ కిరణ్మయి, డి ఆర్ డి ఎ పి డి శోభన్ బాబు, సచివాలయం సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *