Breaking News

ఆగిరపల్లి మండలంలో రాష్ట్ర సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

-మంత్రి పార్థసారథికి అడుగడుగునా పూలవర్షంతో స్వాగతం పలికిన ప్రజలు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆగిరపల్లి మండలం తోటపల్లి గ్రామం విచ్చేసిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి, వారు చెప్పే సమస్యలను సావధానంగా ఆలకించి, అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలోని కొంతమంది వృద్ధులు తాము పేదరికంలో ఉన్నానని, తనకు సొంత ఇల్లు లేదని, తనకు ఇల్లు మంజూరు చేయాలనీ కోరగా, పరిశీలించి ఇంటి స్థలం మంజూరు చేయాలనీ రెవిన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు తమకు గతంలో టిడిపి ప్రభుత్వం సమయంలో పేదలకు స్థలాలు మంజూరు చేశారని , వాటిల్లో కొంతమంది ఇళ్ళు నిర్మించుకున్నారని, కొంతమంది ఇల్లు ప్రారంభదశలో ఉండగా, తదనంతరం వచ్చిన వై.ఎస్.ఆర్.సిపి నాయకులు సదరు ఇళ్లకు బిల్లులు చెల్లించలేదని, ప్రారంభ దశలో ఉన్నవాటిని కూడా నిర్మాణ పనులు పూర్తి చేయనివ్వలేదన్నారు. తమ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ సమస్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉందని, తాను ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, సదరు బిల్లులు చెల్లింపులకు, ప్రారంభ దశలో ఉన్న ఇళ్లకు కొత్త ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. గ్రామంలో సొంత ఇల్లు లేని పేదల వివరాలు తనకు సమర్పించాలన్నారు. ఈ , మార్చి నుండి కేంద్ర ప్రభుత్వం పేదల ఇళ్ల యూనిట్ కాస్ట్ ను 4 లక్షల రూపాయలకు పెంచిదన్నారు, హర్హులైన అందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.కొంత మంది ఇంటి పట్టాలు సమస్య గురుంచి తెలియజేయగా త్వరలో మీ సమస్య తీరుస్తానని మాట ఇచ్చిన మంత్రి, కొంతమంది విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయని మంత్రి దృష్టికి తీసుకొని రాగా వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించిన మంత్రి,కొంత మంది తల్లికి వందనం రాలేదు అనగా సంబదిత అధికారాలను సమస్యను తక్షణ మే పరిష్కరించాలని అదేశించిన మంత్రి.కొందరు డ్రైనేజి సమస్య ఎక్కువగా ఉందని ఆనారోగ్యంతో బాధపడుతున్నామని తెలియజేయగా త్వరలో డ్రైనేజి వ్యవస్థను మెరుగు పరుస్తామని మంత్రి అన్నారు
ఈ గ్రామంలోని ప్రజల ఇళ్ల వద్దకు వెళుతున్న మంత్రికి ప్రజలు అఖండ స్వాగతం పలికారు. సమస్య విన్న వెను వెంటనే సమస్యలను పరిష్కరిస్తూ అధికారులకు అదేశిస్తున్న మంత్రికి ప్రజల అందరూ తమ హర్షాన్ని ,ఆనందాన్ని కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నారు,
మంత్రి వెంట , పంచాయతీ అధికారులు,శ్రీనివాసు, తెలుగుదేశం కూటమి నాయకులు ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *