విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని దేవదాయ ధర్మధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం పశ్చిమ నియోజకవర్గంలో 40 వ డివిజన్ భవానీపురంలో 122, 123 వ సచివాలయం నుంచి ప్రారంభమైన సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. సచివాలయాలలో అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత చేరువ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో ప్రతి ఇంటికి సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు తప్పనిసరిగా వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను చూపుతూ, ఏయే నెలలలో, ఏ యే పథకాలు అమలు అవుతాయనే విషయాలను ప్రజలకు క్లుప్తంగా తెలియజేయాలన్నారు. అనంతరం 123 వ సచివాలయం జరుగుతున్న వ్యాక్సిన్ మంత్రి వెలంపల్లి, మేయర్ కలిసి సందర్శించారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …