-12 మందికి 3లక్షల 50వేల రూపాయల సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ప్రజారోగ్యానికి వైసీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం బ్రాహ్మణ విధిలోని దేవదాయ శాఖ మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 12 మంది లబ్దిదారులకు 3లక్షల 50వేల రూపాయలు (CMRF) చెక్కులను అందచేశారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీని ప్రచారానికివాడుకున్నారని, నేడు జగనన్న దాదాపు 2435 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు అందించబడతుందన్నారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, 54 వ డివిజన్ కార్పొరేటర్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు