-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం నిర్వహించారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 13 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 10, ఇంజనీరింగ్ 1, రెవిన్యూ 1పబ్లిక్ హెల్త్ 1 మొత్తం కలిపి 13 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానెర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జున రావు, పర్యవేక్షణ ఇంజనీర్లు పి. సత్యకుమారి, పి. సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ.శ్రీధర్, బయాలజిస్ట్ కామేశ్వరరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.ఎస్.ఎస్ సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News