జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కేడీసీసీ), PACS ల ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని రైతన్నలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ. 42 కోట్ల మెగా రుణాలను మంగళవారం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలిపారు. సోమవారం జగ్గయ్యపేట పట్టణంలోని కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కార్యాలయంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్డులో గల బి కన్వెన్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని రైతన్నలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ. 42 కోట్ల మెగా రుణాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ , ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, లేళ్ళ అప్పిరెడ్డి, నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పాల్గొననున్నట్లు తెలిపారు. కావున జగ్గయ్యపేట నియోజకవర్గ సహకార సంఘ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ లు, కేడీసీసీ బ్యాంకు, PACS సిబ్బంది, రైతు సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని రవిశంకర్, బుల్లిబాబు, తుమ్మేపల్లి నరేంద్ర, తుమాటి నాగేశ్వరరావు, తుమ్మల ప్రభాకర్, పఠాన్ ఫిరోజ్ ఖాన్, షేక్ జుబేర్, నంబూరి రవి, అన్నెపాక నరసింహారావు, శామ్యూల్, మన్నె అప్పారావు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags jaggaiahpeta
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …