-14 మందికి సేవలందిస్తున్న సింగ్ నగర్ వృధాశ్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో అనాధ లేదా నిరాధరణకు గురైన వృద్దులను గుర్తించి సింగ్ నగర్ నగర పాలక సంస్థ వృధాశ్రమం లో వారికి సంరక్షణ కల్పిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. కమిషనర్ అదేశాల మేరకు శానిటరీ సూపర్ వైజర్ ఆర్. ఓబేశ్వరరావు, సలీమ్ అహ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్ర నగరంలో పర్యటించి సోమవారం వన్‌టౌన్‌లో నిరాధరణకు గురైన 8 మంది వృద్దులకు గుర్తించి వారికి అర్భన్ హెల్త్ సెంటర్ నందు వైద్య పరీక్షలు నిర్వహించి, సింగ్ నగర్ లో రాజీవ్ నగర్ వృధాశ్రమం లో ఆశ్రయం కల్పించారు. పూర్తి ఆహ్లదకరమైన వాతవరణంలో వృద్దశ్రయం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్దులకు ఈ వయస్సుల్లో తమ ఇంట్లో ఉండాల్సిన వసతులను కల్పించడంతో పాటు వైద్య సేవలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. అనాధ లేదా నిరాధరణకు గురైన వృద్దుల సమాచారంను +91 98665 14199 తెలియజేయాలన్నారు.