Breaking News

సాకారం అవుతున్న సొంత ఇంటి కల…

-వై.యస్.ఆర్. జగనన్న కాలనీల్లో ఊపందుకున్న ఇళ్ల నిర్మాణాలు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లులో భాగంగా పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కృష్ణాజిల్లా యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇళ్ల స్థలాలు అందించడమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వై.యస్.ఆర్. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల భవన నిర్మాణ మేస్త్రీలను గుర్తించి వారికి గ్రూపులను అనుసంధానించి నిర్మాణ పనులు అప్పగిస్తున్నారు. ఇప్పటికే 25 వేలమంది లబ్దిదారులతో 1322 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా పరఫరా చేస్తున్నది. ఐ.యస్.ఐ. మార్క్ ఉన్న నాణ్యమైన సిమెంటు, స్టీల్, ఇతర వస్తువులను మార్కెట్ ధరలకంటే తక్కువకే అందిస్తున్నారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే రూ. 1.80 లక్షలతో పాటు మెప్మా, పెల నుంచి సుమారు 78,842 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అదనపు రుణాన్ని కూడా అందిస్తోంది. కృష్ణాజిల్లాలో 1,247 జగనన్న కాలనీల లేఅవుట్లు ఉన్నాయి. 1,89,446 ఇళ్లు మంజూరు చేయగా, వాటిలో ఇప్పటికే 1,03,880 ఇళ్లకు శంఖుస్థాపన జరిగింది. వీటిలో 96,496 ఇళ్లు పునాది దశలో ఉండగా, మరో 3,296 ఇళ్లు పునాది దశను పూర్తి చేసుకున్నాయి. మరో 494 ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. జగనన్న ఇళ్ల కాలనీల్లో సిసి రోడ్లు, మంచినీటి సదుపాయం , డ్రెయినేజీ, విద్యుద్దీ కరణ, అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ వంటి వసతులను సమకూరుస్తున్నారు. పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో సుమారు 450 ఎకరాల భూముల్లో 16 వేలమందికి ఇళ్ల పట్టాలను అందజేశారు. పేదవాడు సొంత ఇంటి కల జగనన్న నెరవేర్చడంతో లబ్ధిదారులు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు.

ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్దిదారుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి…

1. మన్నే కమల, వణుకూరు, పెనమలూరు మండలం :- నేను ఇంతకు ముందు నాసోదరుడిని ఇంట్లో ఉండేదాన్ని. ఇప్పుడు జగనన్న ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టి నివాసం ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాను. నాసొంత ఇంటికల నేను జగనన్న ద్వారా నెరవేర్చుకున్నాను. ఇందుకు జగనన్నకు ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఎన్నో ఇబ్బందులను ఎ దుర్కుని మనకోసం జగనన్న ఈ సొంత ఇంటి కల నెరవేరాలనే సంకల్పంతో మనందరికీ స్థలం ఇచ్చారు. దాంతో సంతృప్తి చెంది మరే ఆలోచన లేకుండా మన సొంత ఇంట్లో నివసిస్తామనే భావన అందరిలో ఉండాలన్నారు. పేదల్లో సొంత ఇంట్లో జీవించే ధృఢ సంకల్పాన్ని కల్పించిన జగనన్నకు ధన్యవాదాలు అన్నారు. జగనన్న కాలనీలో పరిసరాలు చక్కటి ప్రకృతితో నిండి ఉందన్నారు. వీళ్లు సరఫరా ఏర్పాట్లు చేశారని, త్వరలో విద్యుత్తు సౌకర్యం కల్పించే పనులు పూర్తి చేయనున్నారన్నారు. జగనన్న ఇళ్లు మంజూ రైన అందరూ ఇళ్లు నిర్మించుకుని చక్కగా జీవించాలని మన్నే కమల ఆకాంక్షించారు.
2. పెనమలూరు మండలం అడ్డాడకు చెందిన జుజ్జవరపు ఝాన్సీరాణి – తన భర్త జోషిరాజుతో తమకు 10 సంవత్సరాల క్రితం వివాహం అయ్యిందన్నారు. అప్పటినుంచి వణుకూరులోనే అద్దెఇంట్లో నివసిస్తున్నామని అయితే అందులో చాలా కష్టపడ్డామన్నారు. ఇంటిస్థలం అందించి సొంత ఇల్లు నిర్మించుకునేందుకు జగనన్న చూపినదారి అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉందని, నిర్మాణ సమయంలో తమకు పచివాలయ సిబ్బంది అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారన్నారు.
3. పెనమలూరు మండలం వణుకూరుకు చెందిన ఆదిలక్ష్మి :- తాము 15 ఏళ్ల నుంచి అద్దె ఇంట్లో చిన్నగదుల్లో నివసిస్తున్నాం. రూ. 2 వేలు అద్దె చెల్లిస్తూ చాలీ చాలని ఇంట్లో అసౌకర్యంతో ఇంతకాలం నెట్టుకొచ్చాం. నాస్వంత ఇంటికల సాకారం అవుతుందని కలలో కూడా ఊహించలేదు. జగనన్న అందించిన ఆసరాతో సొంత ఇంటి కలపాకారం అవుతున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
4. వణుకూరు గ్రామానికి చెందిన ఉషారాణి!- అద్దెకు ఉంటూ ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో అద్దె ఇంట్లో జీవిస్తున్నామన్నారు. అయితే జగనన్న పుణ్యమా అని స్థలం మంజూ రై ఇల్లు నిర్మించుకునేందుకు మాలాంటి వారికి అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నాం.
5. వణుకూరు గ్రామానికి చెందిన మాతాంగి కీర్తన – నేను షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నా. తన భర్త రాజేష్ ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నారు. తాము ఇరువురూ కష్టపడితే నెలకు రూ. 18 వేల వస్తోందని అందులో రూ. 4 వేలు ఇంటి అద్దె పోగా, మిగిలింది. ఖర్చులకు సరిపోతుంది. ఈ స్థితిలో జగనన్న ప్రభుత్వం ఎటువంటి పిఫాలు లేకుండానే స్థలం మంజూరు చేసారు. ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించడంతో ఇప్పటికే ఇంటి నిర్మాణం పైకప్పుదశకు చేరుతుందన్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సొంత ఇంటికల నెరవేరబోతున్నందుకు ఎంతో పంతోషంగా ఉంది.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *