మానవత్వాన్ని చాటిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా …

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయన ఓ జిల్లా కలక్టర్ సమస్య అని వచ్చి న ఓ వృద్దురాలిని అమ్మలా అక్కున చేర్చుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా IAS కలెక్టర్ కార్యాలయం నుండి బయటకు వెళుతున్న సమయంలో కలెక్టరేట్కు తన సమస్య పరిష్కారం కోసం వచ్చిన మొగల్తూరు మండలం కొత్తట గ్రామానికి చెందిన పిప్పళ్ళ చంద్రమ్మ ను చుసి ఆమెను అక్కున చేర్చుకుని అమె సమస్య సాదరంగా విన్నారు. ఆమె భుజం మీద చెయ్యి వేసుకుని లోనకు తీసుకువెళ్లి జాయింట్ కలెక్టర్ చాంబర్లో సోపాలో కూర్చోబెట్టి ఆమెకి మంచినీరు బాటిల్ అందించారు. ఆమె కలెక్టరేట్ కు రావడానికి గల కారణాలను జిల్లా కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ వయస్సు లో నీవు ఇంత పైకి ఎందుకు ఎక్కవమ్మా నీవు వచ్చావని తెలిసుంటే నేనే క్రింది కి దిగి నిన్ను కలిసి నీ సమస్యలు తెలుసుకునే వాడిని కదా అని ఆమెతో కలెక్టర్ అన్నారు. ఆమెకు సంబంధించిన భూ సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుందని ఆయన ఆమెకు హామీ ఇచ్చారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *