-సచివాలయ ఉద్యోగుల సేవలు ప్రజలకు అందుబాటు ఉండాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సూచించారు. శనివారం 36వ డివిజన్ హనుమాన్ పేటలో డా.జంద్యాల దక్షిణమూర్తి మునిసిపల్ హైస్కూల్ నందలి 193 & 195 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు ప్రవర్తనా నియమావళిని తప్పని సరిగా పాటించాలని, అతిక్రమించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలకు సేవలను అందించే మంచి అవకాశం సచివాలయ ఉద్యోగులకు లభిస్తున్నదన్నారు. తమ విధులు, బాధ్యతలను పూర్తిగా తెలుసు కోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉద్యోగుల హాజరు పట్టిక మరియు సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చు దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News