Breaking News

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట…

-నాడు – నేడుతో ఆసుపత్రుల ఆధునీకరణ….
-పేదలపాలిట ఆపద్బాంధవిలా నిలుస్తోన్న 104 సంచార వైద్య సేవలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు సమూలంగా మార్చి పేదవాడికి కూడా ఆధునిక వైద్య సేవలు అందజేయాలని లక్ష్యంతో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్సుకు అమగుణంగా ఆసుపత్రుల ఆధునీకరణకు నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణ జిల్లాలో 656 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఒక్కొక్క దానికి రూ. 17.5 లక్షల చొప్పున మొత్తం రూ. 114.80 కోట్లు మంజూరు జరిగింది. జిల్లాలో 90 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలగాను 10 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు నూతన భవనాల నిమిత్తం రూ. 18, 35 కోట్లు, మిగిలిన 80 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యలు, మరమత్తులు నిమిత్తం రూ. 28.52 లక్షల పనులు జరుగుతున్నాయి. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు 564 రకాల మందులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం 607 రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 154 రకాల మందులు అందుబాటులో వుండగా నేడు 214 రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకువెళ్ళేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వైద్య ఆరోగ్య శాఖల హెల్త్ సెక్రటరి/ గ్రేడ్-3 ఏఎన్‌యం 1187 పోస్టులను జిల్లాలో మంజూరు చేయగా వాటిలో 1139 మందికి పోస్టింగ్ ఇచ్చారు. ఆపద్భాంధవి 104 సంచార వైద్య సేవలు:
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో ఎవరికైన అనారోగ్యం చేస్తే ఏదేని ఆసుపత్రికి వెళదామంటే కరోనా పరీక్షలు చేయించుకుని వస్తేనే చేర్చుకునేవారు. దీంతో సామాన్య ప్రజలు సాధరణ జబ్బులకు వైద్యం అందక నానాయాతన పడేవారు, అలాంటి పరిస్థితిల్లో 104 వాహనం వారిని దైవంలా అదుకుంది. ఇంటి ముంగిటకు వచ్చి ఉచితంగా వైద్యం చేయడంతోపాటు నెలకు సరిపడ మందులు కూడా ఇచ్చి పేదల పాలిటి ఆపద్బాంధవిలా నిలిచింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 వాహనాలు కరోనా సమయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యంత వైద్య సేవలను అందిస్తున్నాయి. బిపి, షుగర్ తో పాటు ఇతర సాధారణ వైద్య సేవలకు నేడు 104 ద్వారా డాక్టర్లు, నర్సులు, నేరుగా ఇళ్లవద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. కృష్ణాజిల్లాలో ప్రతి పిహెచ్ సి పరిధిలో 104 వాహనాల టూర్ షెడ్యూల్‌ను ప్రతి గ్రామంలోను ప్రదర్శించేలా జిల్లా కలెక్టర్ జె. నివాన్ చర్యలు తీసుకున్నారు.
నాడు జిల్లాలో 20 సంచార వైద్య సేవల వాహనాలు వుండగా.. నేడు 49 వాహనాలను ప్రతి మండలానికి ఒక్కటి చొప్పున ప్రభుత్వం ఏర్పాటు చేసింది… వాడు 7 రకాల లాబ్ పరీక్షలు వుండగా… నేడు 9 రకాల లాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు… వాడు 62 రకాల మందులు అందుబాటులో ఉండగా… నేడు 74 రకాల మందులు అందుబాటులో వున్నాయి… నాడు డాక్టర్ ఇంటి వద్దకు వెళ్లవారు కాదు… నేడు డాక్టర్ ఇంటివద్దకు వెళ్లి సేవలందిస్తున్నారు… నాడు మందుల కొరత ఉండేది… నేడు మందుల కొరత లేకుండా ఎక్కువ మందులతో సేవలందిస్తున్నారు… నాడు 4,5, మండలాలకు ఒక వాహనం వుండేంది… నేడు మండలానికి ఒక వాహనం వుంది… ఇది ఇలా వుండగా 104 సంచాల వైద్య సేవల ద్వారా 2021 ఏప్రిల్ నుంచి ఇంతవరకు 1399 సందర్శన ద్వారా సుమారు 2 లక్షల 26 వేల మందిని పరీక్షించారు. వైద్య సేవలు పొందిన వారిలో గర్భిణీ స్త్రీలు, ప్రసవానంతర సేవలు, పిల్లలకు బిపి, మధుమేహం, ఇతర వ్యాధులకు చికిత్సలు అందించారు.

Check Also

ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్ ఆఫ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *