Breaking News

ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల యాజమాన్యం అవకతవకలపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర మంత్రిని కోరిన పలాస ప్రజలు…

-ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి…
-గతంలో హమీ ఇచ్చిన యాజమాన్యం ఇప్పుడు మాట నిలబెట్టుకోవాలి…

పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉన్న ఎస్.బి.ఎస్.వై.ఎమ్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాల యాజమాన్యం చేస్తున్న అవకతవకలపై ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని కోరుతూ పలాస ప్రజల తరుపున రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో పలాస పుర ప్రజల తరుపున ప్రజల కోరిక మేకరకు ఎస్.బి.ఎస్.వై.ఎం డిగ్రీ కళాశాలకు సంబందించి గతంలో స్థలం దాతలు ఇచ్చారని కొన్నేళ్లుగా పలాసకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలనే ఉద్దేశంతో ఉద్యమ పోరాటాలు పలాస ప్రజలు చేపట్టారు. ఆసమయంలో ఎస్.బి.ఎస్.వై.ఎం డిగ్రీ కళాశాల యజమాన్యం శివ మునీంద్రా బాలాజీ స్వామి ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పలాసలో మంజూరు చేస్తే తన కళాశాలను ప్రభుత్వ కళాశాలకు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని పలువురు మంత్రిని కోరారు.

రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు ఈ విదంగా ఉన్నాయి. వీని పరిష్కరించాలని పలువురు కోరారు. వివరాల్లోకి వెలితే. పలాస కాశీబుగ్గ పట్టణానికి చెందిన పెద్దలు ఎం.ఎం. పండా, కె. వి రమణయ్య, తాళాసు చిన్న దశరధుడు తదితర సుమారు 16 మంది ఇక్కడ పారిశ్రామిక రంగం అభివృద్ధితో పాటు విద్యారంగ అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంత ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో 1979-80 సంవత్సరంలో కాశీబుగ్గ లోని సర్వే నెంబరు 244/2ఎ, 244/3బి, 244/5 డి, 245/ 2ఎ, 245/7ఎ, 245/8 లోని సుమారు 3.50 ఎకరాల స్థలాన్ని, అందులో కొన్ని భవనాలు నిర్మాణం చేసి డిగ్రీ విద్యను ఉచితంగా అందివ్వడం కోసం యూనివర్శల్ పీస్ ఆఫ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ బాలశివ యోగేంద్ర స్వామీజీకి ఉచితంగా అందజేశారు. కళాశాల ప్రారంభమైన కొద్ది సంవత్సరాల లోనే కళాశాల లో అనేక అవకతవకలు జరగడం మొదలయ్యాయి. అక్కడ పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ సమయాల్లోనూ మరియు నియామక సమయాల్లో స్వామీజీ వేధింపులు ఎక్కువయ్యాయి. ఫీజుల వసూళ్లను అనేక అక్రమాలు జరిగాయి. కళాశాలలో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక అధికారిని నియమించి దర్యాప్తు నిర్వహించాలని అనేక ఫిర్యాదులు ఆర్జేడీ స్థాయి అధికారుల వద్ద నేటికి ఉన్నాయి. పలాస ప్రజల ఎన్నో ఏళ్ల కల, మీ ప్రత్యేక, చొరవ కృషి ఫలితంగా నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు అయింది. ఇదే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో నూతన చట్టాలను తీసుకొచ్చింది. అందులో భాగంగా ఎయిడెడ్ కళాశాలల్లో ఎడ్మిషన్లు నిలుపుదల చేస్తు జీవో నెంబరు 52 ని తీసుకొచ్చింది. దీంతో పాటు ఎయిడెడ్ కళాశాలలని ప్రభుత్వానికి అప్పగించాలని లేదా ప్రైవేట్ కళాశాలల గా నిర్వాహకులు నిర్వహించుకోవాలని జీవో నెంబరు 42 తీసుకొచ్చారు. ఫలితంగా SBSYM ఎయిడెడ్ డిగ్రీ కళాశాల రద్దు కానుంది. ప్రైవేట్ కళాశాలగా స్వామీజీ ఆధ్వర్యంలో నడవనుంది. తరువాత కాలంలో కళాశాల నష్టాల పేరుతో కాశీబుగ్గ పెద్దలు విద్య కోసం ఉచితంగా అందజేసిన స్ధలం భవనాలను స్వామీజీ దుర్వినియోగం చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైన నేపధ్యంలో కళాశాల నిర్వహణ కోసం సొంత భవనాల కోసం స్థల పరిశీలన అధికారులు చేస్తున్నారు. ఉచిత డిగ్రీ విద్య కోసం SBSYM డిగ్రీ కళాశాల కై స్వామీజీకి ఉచితంగా అందజేసిన స్థలాన్ని, భవనాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకుని అక్కడే ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరగతులు నిర్వహణ చెయ్యాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు కళాశాలలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక అధికారుల కమిటీ నియమించి దర్యాప్తు నిర్వహించాలని కోరారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *