
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో అత్యాధునిక వైద్య సేవలతో శ్రీ రామ్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభమయింది. ఆదివారం కస్తూరిభాయిపేటలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కవిత చలసాని మాట్లాడుతూ మహిళల కోసం అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అందించేందుకుగాను అత్యాధునిక వైద్య సేవలతో శ్రీ రామ్ హాస్పిటల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలకు సంబంధించిన అన్ని వైద్య సేవలు, అందిస్తామని, ముఖ్యంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ ద్వారా ఎటువంటి ఇబ్బందుకు లేకుండా వైద్య సేవలు అందిస్తామని అన్నారు. లాప్రోస్కోపీ సర్జరీ, క్యాన్సర్ స్క్రీనింగ్ , పిల్లలు లేని వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక చికిత్స అందించనున్నట్లు తెలిపారు. చిన్నపిల్లల విభాగం కూడా ఉందని అన్నారు. 24 గంటలు పూర్తి అందుబాటులో వైద్యులు ఉంటారని అన్నారు. అత్యవసర కేసులకు సంబంధించి అత్యంత నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందితో 24 గంటలు సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ డాక్టర్ చలసాని లలిత కుమారి, పలువురు వైద్యులు, నగర ప్రముఖులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News