Breaking News

పీ 4 ద్వారా మహిళకు చేయూత సుజనా ఫౌండేషన్ ద్వారా కుట్టు మిషన్ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ చల్లా మౌనిక కు భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కుట్టు మిషన్ అందజేశారు. బ్యాంకు సెంటర్ లో నివాసముంటున్న చల్లా మౌనిక తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేదని జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్ అందజేయాలని ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పీ 4 లో భాగంగా, సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ 5,500 విలువచేసి ఉష కుట్టు మిషన్ ను కూటమి నేతలతో కలిసి ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు. చేయూతనిచ్చిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి లబ్ధిదారు చల్లా మౌనిక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీ వీ చిన సుబ్బయ్య, 42 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు, యంగ్ ప్రొఫెషనల్ కాకర్ల ప్రేమ్ దీప్, కూటమి నేతలు గంగవరపు సురేష్, రవి, మన్నెం నారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *