విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నెల్లూరు జిల్లా , ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు కు భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ఆత్మీయ స్వాగతం పలికి దుస్సాలువతో సత్కరించారు. ఆయన గురువారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయానికి విచ్చేయగా ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు పీ వీ చిన సుబ్బయ్య, పత్తి నాగేశ్వరరావు తదితరులు కొమ్మి లక్ష్మయ్యకు ఆత్మీయ స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి దుస్సాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా కొమ్మి లక్ష్మయ్య మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని ఆత్మకూరునియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చానన్నారు ,మౌలిక సదుపాయాలను కల్పన కోసం కృషి చేశానని తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారన్నారు. భవానిపురంలో నెల్లూరు, ప్రకాశం జిల్లా వాసులందరూ సోదర భావంతో ఉంటూ కూటమి బలోపేతానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. టిడిపి నేతలతో ముఖాముఖి మాట్లాడి పలు విషయాలను వారితో పంచుకున్నారు.
Prajavartha Online Telugu News