-రాష్ట్రంలో 58 ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఇంతవరకూ రూ.14750 కోట్లు ఖర్చు చేశాం..
-పోలవరం ప్రాజెక్టుకోసం త్యాగం చేసిన నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది..
-ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి అంతరాష్ట్ర సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తాం.
-జలవనరుల శాఖా మంత్రి పి.అనీల్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి పళాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి పి. అనీల్ కుమార్ అన్నారు.
విజయవాడలోని ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇయన్ సి నారాయణ రెడ్డిలతో కలిసి ఇరి గేషన్ ప్రాజెక్టు పనుల అమలు తీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 58 ఇరిగే షన్ ప్రాజెక్టు పనులను చేపట్టామని వాటికి సంబంధించి ఇంతవరకూ రూ. 14750 కోట్లు ఖర్చు చేశామన్నారు. రైతుల సాగునీటి అవసరాలతోపాటు ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులను చేపట్టామని అన్నారు. ప్రతీ రైతుకూ తన పొలంలోకి సాగునీరు అందించేలా, శివారు భూములకు కూడా సాగునీరు అందేలా కాల్వల వ్యవస్థను అభివృద్ధి చేశామని మంత్రి అన్నారు. ఉత్తరాంధ్రలోని వంశధార, తోటపల్లి, ఉత్తరాంధ్ర సృజలస్రవంతి మొదలగు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాయలసీమలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ పంబంధిత ఏజెన్సీల ద్వారా పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సంబంధిత ఇంజినీరింగ్ సిబ్బంది పనులను పర్యవేక్షించాలని మంత్రి అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం నియమ నిబంధనలను పాటిస్తూ అవసరమైన పనుల విషయంలో మట్టి పరీక్షలను (Soil Tests) నిర్వహించి నిర్మాణదశలో ఉన్న అన్ని పనులను వేగవంతం చేయాలని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఇందుకు సంబంధించి చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయుటకు కావాల్సిన పిబ్బంది కొరతగా ఉన్నారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ విషయమై మంత్రి అనిల్ కుమార్ స్పందిస్తూ వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.
వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి రెండవ సొరంగం పనుల పురోగతిని మంత్రి సమీక్షిస్తూ ఇంకనూ మిగిలిన పనులన్నింటినీ ప్రభుత్వం నియమనిబంధనలు అనుసరించి పూర్తి చేయాలని మంత్రి అధికారులను కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులను సమీక్షిస్తూ భూసేకరణ విషయంలో కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతరాష్ట్ర సమస్యలున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఇతర రాష్ట్ర అధికారులతో సామరస్యంగా చర్చలు జరిపి పనులను పూర్తి చేయాలని మంత్రి అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఇరిగేషన్ ఇయన్ సి సి. నారాయణ రెడ్డి, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారు బియ యన్. రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, సంబంధిత జలవనరుల శాఖ
అధికారులు పాల్గొన్నారు.