-నిరాధారణకు గురైన నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు గొప్పవరం.
-జిల్లాలో 2,60,036 మందికి రూ 113.72 కోట్లు పంపిణీ.
-ఒక్క చాట్రాయి మండలంలోనే వివిధ రకాల పింఛన్లు 8,305 మందికి రూ 3 కోట్ల 52 లక్షల 60 వేల రూపాయలు పంపిణీ.
-రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు/ చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త :
చాట్రాయి మండలం నరసింహారావు పాలెం క్రొత్త అర్జునవాడ, మెయిన్ రోడ్డు, సాగర్ బజార్లో శనివారం అవ్వ తాతలు, దివ్యాంగులు, వితంతువులు, తదితర ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లును ఇంటింటికి స్వయంగా వెళ్ళి నిరాధారణకు గురైన నిరుపేదలు యోగక్షేమాలను, ఆరోగ్య వివరాలను, గ్రామ, కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకుని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లబ్ధిదారులకు నగదును అందజేశారు. ముందుగా గ్రామ ప్రజలు, మహిళలు పూలమాలలు వేసి, మంత్రికి ఘనస్వాగతం పలికాను. స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి, మంత్రి ఘనంగానివాళులు అర్పించారు. ప్రజలు అడిగిన కొన్ని సమస్యలను వెనువెంటనే పరిష్కరించారు. కొందరు ఇల్లు కావాలని అడగగా వెంటనే ధరఖాస్తులు పెట్టుకోండి వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. చాట్రాయి మండలంలో 100 మందికి పైగా గొర్రెలు పెంపకం దారులను గుర్తించి ఒక్కొక్కరికి రూ 4 లక్షలు చొప్పున నాలుగు కోట్లు మంజూరుకు అధికార్లు చర్యలు చేపట్టాలని, బ్యాంకు అధికారులతో మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఒకే రోజున ఒకే సారి పెద్ద ఎత్తున పింఛన్లును సొమ్ముపెంచి ప్రతినెల ఇంటింటికి వెళ్ళి నిరుపేద కుటుంబాలను కలుసుకుని వారి యోగక్షేమాలు, కుటుంబ ఆరోగ్య ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకుని పింఛన్లు సొమ్ము అందజేస్తున్నామని అన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ 3 వేలు నుంచి రూ 4 వేలుకు, దివ్యాంగులకు రూ 3 వేలు నుంచి రూ 6 వేలుకు, బెడ్ రెస్టులో ఉన్న వారికి రూ 10 వేలు, రూ 15 వేలు చొప్పున పెంచి అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టిందని, పనిచేసే ప్రభుత్వానికి, పనిచెయ్యని ప్రభుత్వానికి తేడాను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఏ ఆదరణ లేక నిరాధారణకు గురైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందన్నారు. గత ప్రభుత్వం హంగుఆర్భాటాలు, రంగులు మీద పెట్టిన శ్రద్ధ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై పెట్టలేదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుపేదలు ఇంటికి స్వయంగా వెళ్ళి పింఛన్లు సొమ్మును అందిస్తున్నారని గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయలేదని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినా కూటమి ప్రభుత్వాన్ని దీవించిన అన్ని వర్గాలు ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతోనే అభివృద్ధి, సంక్షేమ దిశగా రాష్ట్రానికి మంచి ప్రజాపాలన అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి తహశీల్దారు జి.బద్రు, యంపిడివో బి.ఏ. సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, గ్రామ సచివాలయ, వివిధ శాఖల ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News