విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఆదేశాల మేరకు మండల ప్రజాపరిషత్తు అధ్యక్షులు, ఉపాధ్యక్షుల, కోఆప్టెడ్ మెంబరు ఎన్నిక కొరకు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24వ తేదీన నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మండల ప్రజాపరిషత్తు ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా కలెక్టరు జె.నివాస్ సూచించారు.
యంపిపి కోఆప్టెడ్ మెంబరు ఎన్నిక నిమిత్తం ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు మండల ప్రజాపరిషత్తు సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సమావేశానికి సంబంధిత యంపిటిసిలు హాజరయ్యేలా సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత సభ్యులకు నిర్దిష్ట ఎన్నిక నోటీస్ పంపాలన్నారు. ఇందుకు సంబంధించి కోఆప్టెడ్ సభ్యుని ఎన్నిక కొరకు సంబంధిత మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటల లోపు సంబంధిత వ్యక్తులు తమ నామినేషన్ పత్రాలను అభ్యర్థి లేదా ఆయన ప్రతిపాదించిన వ్యక్తి ప్రిసైడింగ్ అధికారులకు అందజేయవలసి ఉంటుంది. మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో అదేరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టడం జరుగుతుంది. చెల్లుబాటు అయ్యే నామినేషన్ పత్రాలకు సంబంధించిన వ్యక్తుల పేర్లను ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు యంపిపి కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రచురించడం జరుగుతుంది. కోఆప్టెడ్ సభ్యుని ఎన్నికల నుండి ఎవరైనా అభ్యర్తి ఉపసంహరించుకుంటున్న సందర్భంలో ఆమేరకు ఒక నోటీసు అభ్యర్థి లేదా ఆయనను ప్రతిపాదించిన వ్యక్తి యంపిపి కార్యాలయంలో ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు ప్రిసైడింగ్ అధికారికి అందజేయవలసి ఉంటుంది.
మండల ప్రజాపరిషత్తు సభ్యుల ప్రత్యేక సమావేశం ప్రమాణ స్వీకారం, కోఆప్టెడ్ ఎన్నికల నిర్వహణ మధ్యాహ్నం 1 గంటకు జరుగుతుంది. సమావేశానంతరం వెంటనే ఎన్నికల ఫలితాలు ప్రకటించబడతాయి. అదేవిధంగా మండల ప్రజాపరిషత్తు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుని ఎన్నిక కొరకు మండల ప్రజాపరిషత్తు ప్రత్యేక సమావేశం ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబడుతుంది. కోఆప్టెడ్ సభ్యుని ఎన్నిక ముగిసిన తర్వాత అదేరోజున సదరు సభ్యులు పాల్గొనవలిసినట్టి మరొక సమావేశం మండల ప్రజాపరిషత్తు అధ్యక్షుని/ఉపాధ్యక్షుని ఎన్నిక కొరకు మండల ప్రజాపరిషత్తు కార్యాలయం నోటీసు బోర్డు నందు ప్రచురించినట్టి వేళలయందు యంపిపి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఏ కారణం చేతనైనా ఆరోజున అట్టి ఎన్నిక జరగనట్లయితే ఆమరుసటి రోజున అది మండల ప్రజాపరిషత్తు పాటించే సాధారణ సెలవు రోజు అయినా కాకపోయినా ఎన్నికను నిర్వహించడం అవుతుంది. సదరు సమావేశానికి కూడా సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఎన్నిక నోటీసు మండల ప్రజాపరిషత్తు సభ్యులకు సంబంధిత ప్రిసైడింగ్ అధికారి పంపించవలసి ఉంటుందన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …