విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రముఖ తెలుగు కవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నాటి సామాజిక సమస్యలపై గురజాడ అప్పారావు సాహిత్యం ఆలంబనగా గళం విప్పారన్నారు. ప్రసిద్ధ తెలుగు నాటక రచయితగా, కవిగా ఆయన సేవలు నిరుపమానమని, 1892లో గురజాడ రాసిన కన్యాశుల్కం నాటిక విమర్శకుల ప్రశంసలు అందుకుందన్నారు. ఇది తెలుగు భాషలో గొప్ప నాటకంగా గుర్తించబడి నేటికీ అజరామరంగా ప్రదర్శించబడుతూనే ఉందన్నారు. 1910 లో గురజాడ వెంకట అప్పారావు రాసిన “దేశమును ప్రేమించుమన్న” అన్న దేశభక్తి గీతం ఎందరో స్వాతంత్ర్య సమరయోధులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …