Breaking News

వర్చువల్ లో జిల్లా వ్యవసాయ అడ్వయిజరీ బోర్డు సమావేశం…

-ఇ-క్రాప్ పంట నమోదు సెప్టెంబరు 30 నాటికి పూర్తి కావాలి
-జిల్లా కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇ-క్రాప్ పంట సమోదు సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా స్థాయి వ్యవసాయ అడ్వయిజరీ బోర్డు సమావేశం వర్చువల్ ద్వారా నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొనగా ఆయా ప్రాంతాల నుంచి బోర్డు చైర్మన్ జన్ను రాఘవరావు, జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత, వ్యవసాయ జెడిటి మోహన్ రావు, పశుసంవర్ధకశాఖ జెడి విద్యాసాగర్, డ్వా మా పిడి సూర్యనారాయణ, ఎడియం ఆర్ రామ్మ హరావు , నాబార్డు డిడియం విజయ్, ఏపిసిపిడిసిఎల్ ఎ ఏ. జయకుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరయ్య, అగ్రికల్చర్ సీనియర్ సైంటిస్టు డా.యం.గిరిజరాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా.కె. వసంత బాను, ఏపి సీడ్స్ డియం కె. బుచ్చమ్మ, మార్క్ ఫెడ్ డియం మల్లిక, మార్కెటింగ్ డియం దివాకర్, ఇతర రైతు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ఇ-క్రాప్ నమోదు లక్ష్యాలను సెప్టెంబరు నెలఖారు నాటికి పూర్తి చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాలను అనుసంధానంగా పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు వ్యాక్సినేషన్ క్యాంపులు ఎక్కువగా నిర్వహించాలన్నారు. రైతు సమస్యల పరిష్కరమే ధ్యేయంగా ఆలికి స్థాయిలో ప్రతీ నెల మొదటి శుక్రవారం, మండల స్థాయిలో రెండవ శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడవ శుక్రవారం, క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ఆయా స్థాయిల్లో రైతుల నుంచి అందిన సమస్యల పరిష్కరానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సెప్టెంబరు నెలలో ఆ0కి స్తాయిలో 801, మండల స్థాయిలో 50 వ్యవసాయ సలహా బోర్డు సమావేశాలు జరిగాయన్నారు. జిల్లాలో 246 దా, వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు ( కస్టమైర్ సెంటర్స్) ఏర్పాటు గాను ఇంతవరకు 210 ఏర్పాటు కాగా మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయిల్ ఫామ్ పంటకు సంబంధించి పలువురు రైతులు సబ్సిడీ విషయం ప్రస్తవించాగా ఇప్పటికే నూజివీడు ప్రాంతంలో సబ్సిడీపై సీడ్ కిట్స్ పంపిణీ చేశారన్నారు. ఎలుకల నివారణకు నూరు శాతం సబ్సిడీపై బ్రోమోడయోలిన్ సరఫరా చేయడం జరిగిందన్నారు. నివార్ తూఫాన్ సమయంలో మచిలీపట్నం మండలంలో పంట నష్టానికి సంబంధించి రూ 1.98 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ సొమ్ము రావాల్సివుందని, అదేవిధంగా గత నవంబరులో బారీ వర్షాలకు దెబ్బతిన్న పంటకు రూ 3, 26 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ అందాల్సివుందని కమిటీ చైర్మన్ జన్ను రాఘవరావు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ జె. నివాస్ స్పందిస్తూ ఈ విషయంపై మరోమారు వ్యవసాయశాఖ రాష్ట్ర ఉన్నత అధికారులకు లేఖ వ్రాయాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ను ఆదేశించారు. మండల స్థాయి అద్వయిజరీ సమావేశంలో పలువురు రైతులు యంటీలు, 1318 వరి విత్తనాలు ఖరీఫ్ కోరడం జరిగిందన్నారు.

Check Also

సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 25 రూపాయల నుంచి 28 రూపాయిలకు పెంపు

-జేఏసీ నాయకులతో కుదిరిన ఒప్పందం – సమ్మె విరమణ -తద్వారా 5791 మంది ముఠా కార్మికులకు లబ్ధి -ఆహారం,పౌరసరఫరాల మరియు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *