Breaking News

పి.బి. సిద్ధార్థలో ఆంగ్లవిభాగం జాతీయసదస్సు

-స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ విభాగాల న్యూరల్  టార్నెడో

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఇంగ్లిష్ విభాగం సమకాలీన ఇంగ్లిష్ సాహిత్యం, భాషా సంస్కృతులపై రెండురోజులపాటు ఈ 15, 16 తేదీల్లో కళాశాల వెబినార్ హాలులో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మేకా  రమేశ్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, ఆంగ్ల విభాగాధిపతి డా.శ్రీలత తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టరును వారు ఆదివారం విడుదల చేశారు. ఆసక్తి కలిగినవారు ప్రసంగపత్రాలు సమర్పించాలన్నారు. కాగా కళాశాల స్టాటిస్టిక్స్ విభాగం, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా ఈనెల 16న నిర్వహించే న్యూరల్  టార్నెడో కార్యక్రమం పోస్టరు ఆవిష్కరణ కూడా జరిగింది.  స్టాటిస్టిక్స్ విభాగాధిపతి, అకడమిక్ ఆఫీసర్ జి.చక్రవర్తి, డేటా సైన్స్ విభాగాధిపతి కె.ఉదయశ్రీ మాట్లాడుతూ స్టాట్ క్వెస్ట్, డేటా అనాలిసిస్, ప్రాజెక్ట్ ఎక్స్ పో, హ్యాక్ ఫ్యూజన్, క్రియేటివ్ ఫోటోగ్రఫీ, రీల్ మేకింగ్ తదితర పోటీలను నిర్వహించి బహుమతులు అందచేస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *