Breaking News

చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌ వారు అమ్మవారి భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తుల పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ మోనిటరింగ్ సిస్టమ్ ట్యాగ్ వేయడం జరుగుతోంది. ఒకవేళ చిన్నారులు తప్పిపోతే సత్వరం గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఈ ట్యాగ్ ఉపయోగపడుతుంది. మొత్తం 12 ప్రదేశాలలో 240 సిబ్బంది తో ట్యాగ్ లు వేయటం జరుగుతుంది. గత నాలుగు రోజులు నుండి 24 వేలు ట్యాగ్ లు వెయ్యటం జరిగింది. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి షేక్ రుక్సానా సుల్తాన బేగం ఎప్పటికప్పుడు పరివేక్షణ చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో సీడీపీఓలు లక్ష్మి భార్గవి, కృష్ణ కుమారి, భానుమతి, పుష్పలత, సత్యవతి, జోష్నా, డీసీపీవో యమ్. రాజేశ్వరరావు, కిరణ్ కుమార్, జాన్సన్,దుర్గ ప్రసాద్, సూపెర్వైసోర్ లు, డీసీపీయు సిబ్బంది మరియు స్వచ్చంద సంస్థలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *