Breaking News

Tag Archives: vijayawda

వించిపేట ప్రజలకు రైతుబజారుని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్…. : జి.కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వించిపేట ప్రజలకు అందుబాటులోకి రైతుబజారుని తీసుకోని రావాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ 49,50,54 మరియు 55వ డివిజన్ల ఆధ్వర్యంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు తాడి పైడయ్య అధ్యక్షతన 174,186 సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి కామ్రేడ్ జి.కోటేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పాతబస్తీ, వించిపేట ప్రాతంలోని ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకు తాజా కూరగాయలు …

Read More »

నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి

-ఆంధ్రా కార్పొరేట్ దిగ్గజాల హస్తముందనే ప్రచారం -మాఫియా, అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలి -ఎన్‌టీఏ సమగ్ర ప్రక్షాళన చేయాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్-2026 పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని, పేపర్ లీక్ కి పాల్పడిన మాఫియా, అధికారులు, మధ్యవర్తులు, సంబంధిత సంస్థలపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన …

Read More »

రాష్ట్రంలో ఎక్కడా వంటగ్యాస్ సమస్య లేదు-వినియోగదారులు ఆందోళన చెందవద్దు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి వంట గ్యాస్ కొరత లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరవ్ గౌర్ స్పష్టం చేశారు. 17వేల 962 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.గ్యాస్ సరఫరాపై జిల్లా కలెక్టర్లు,ఎంఎల్ఏలకు ఒక కమ్యునికేషన్ ప్రణాళికను విడుదల చేశారు.దాని ప్రకారం తప్పుడు సమాచారం వల్ల ఆందోళనతో బుకింగ్‌లు, నిల్వలను నివారించేలా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రజా ప్రతినిధులు మరియు మీడియాకు ఎప్పటి కప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని అందించాలని సూచించారు. ఎంఎల్ఏలు కలెక్టర్లు …

Read More »

కనకమేడల రవీంద్ర కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్(ASG) గా నియమితులైన సీనియర్ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర ని లబ్బీపేట లోని వారి నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా విశేష సేవలందించిన కనకమేడల రవీంద్ర ఇకపై అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం తరఫున కీలక వాదనలు వినిపించనుండటం ఎంతో ఆనందంగా ఉంది. దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పదవిలో తెలుగు వ్యక్తి నియమితులు కావటం ఎంతో …

Read More »

చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌ వారు అమ్మవారి భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తుల పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ మోనిటరింగ్ సిస్టమ్ ట్యాగ్ వేయడం జరుగుతోంది. ఒకవేళ చిన్నారులు తప్పిపోతే సత్వరం గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఈ ట్యాగ్ ఉపయోగపడుతుంది. మొత్తం 12 ప్రదేశాలలో 240 సిబ్బంది తో ట్యాగ్ లు వేయటం జరుగుతుంది. గత నాలుగు రోజులు నుండి 24 వేలు ట్యాగ్ లు వెయ్యటం …

Read More »

“అన్న”మమోఘం పరబ్రహ్మస్వరూపం…

-పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు.. జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విజ‌యవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నం పరబ్రహ్మస్వరూపమని సృష్టిలో సర్వ ప్రాణులకు ఆహారం ఎంతో ముఖ్యమని పేదవాడి ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా అన్నార్తులకు ఆత్మీయత పంచే అన్న క్యాంటీన్లలో నిర్వహణ పరంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ పరిశీలనలో భాగంగా గురువారం జిల్లా …

Read More »

దీన్-దయాళ్ అంత్యోదయ జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ పై సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ లో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించేందుకు దీన్-దయాళ్ అంత్యోదయ జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ (DAY-NULM) డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ యాదవ్, మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. …

Read More »

అత్యవసర పరిస్థితి అనేది కాంగ్రెస్ అధికార దాహంతో అన్యాయం చేసిన యుగం : అమిత్ షా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 25, 1975, భారతదేశ రాజ్యాంగ చరిత్రలో ఒక తేదీ మాత్రమే కాదు, అధికార దాహంలో ప్రజాస్వామ్యం యొక్క ఆత్మ నలిగిపోయిన చీకటి రోజు. ఇది కేవలం ‘అత్యవసర పరిస్థితి’ కాదని, అధికార దాహంతో ఉన్న కాంగ్రెస్ తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి చేసిన చివరి, తీరని ప్రయత్నం అని, జాతీయ భద్రత అనే తప్పుడు సాకుతో దేశంపై బలవంతంగా రుద్దబడిన అన్యాయ కాలం అని కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి మరియు సీనియర్ బిజెపి …

Read More »

25 నుంచి 30 తేదీ లోపు 65 ఏళ్ల పైన వృద్ధులకు, దివ్యాంగులకు సరుకులు అందజేయాలి

-89.64% రేషన్ పంపిణీ విజయవంతం – చరిత్రలో మైలురాయి -చౌక ధర దుకాణదారులకు, అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందనలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రేషన్ సంస్కరణల్లో భాగంగా ప్రతినెల 26వ తేదీ నుంచి 30 తేదీలోపు వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందజేయాలని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో ఈరోజు మంత్రి నాదెండ్ల మనోహర్ చౌకధర దుకాణదారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జూన్ 1వ తేదీ …

Read More »

ఆవేద‌నను ఆలకించారు.. ట్రై సైకిళ్లు అందించారు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల ఆవేద‌న‌ను ఆల‌కించి ఆపై స‌త్వ‌రం స్పందించి మూడు చ‌క్రాల సైకిలును అంద‌జేసి జీవిత మార్గానికి బాటవేసిన జిల్లా యంత్రాంగం.. ప్ర‌తి సోమ‌వారం ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించి ప‌రిష్కరించే కార్య‌క్ర‌మ‌మైన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) దివ్యాంగుల జీవ‌న మార్గానికి బాట‌లు వేసింది. ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ క‌లెక్ట‌రేట్‌లో ఒక కార్య‌క్ర‌మాన్ని ముగించుకొని ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో దివ్యాంగుణ్ని చూసి చ‌లించి అత‌ని వ‌ద్ద‌కు వెళ్లి అర్జీని స్వీక‌రించి అదేరోజు బాధితునికి మూడు …

Read More »