అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి వంట గ్యాస్ కొరత లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరవ్ గౌర్ స్పష్టం చేశారు. 17వేల 962 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.గ్యాస్ సరఫరాపై జిల్లా కలెక్టర్లు,ఎంఎల్ఏలకు ఒక కమ్యునికేషన్ ప్రణాళికను విడుదల చేశారు.దాని ప్రకారం తప్పుడు సమాచారం వల్ల ఆందోళనతో బుకింగ్‌లు, నిల్వలను నివారించేలా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రజా ప్రతినిధులు మరియు మీడియాకు ఎప్పటి కప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని అందించాలని సూచించారు. ఎంఎల్ఏలు కలెక్టర్లు సరఫరాలు సాధారణం ఆంధ్రప్రదేశ్ అంతటా దేశీయ వినియోగదారులకు LPG సరఫరా కొనసాగుతోందని ఎప్పటి కప్పుడు తెలియజేయాలని చెప్పారు.
సోషల్ మీడియా పుకార్ల కారణంగా రీఫిల్ బుకింగ్‌లు తాత్కాలికంగా పెరిగాయి, అయితే డెలివరీలు FIFO (ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్) క్రమంలో కొనసాగుతున్నాయని తెలిపారు. దేశీయ వినియోగదారులకు ప్రాధాన్యత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (IOCL, HPCL, BPCL) గృహ LPG సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. దేశీయ లభ్యతను నిర్ధారించడానికి పారిశ్రామిక మరియు బల్క్ LPG సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మరియు OMCs రోజువారీగా సరఫరాను పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.
వినియోగదారులు భయాందోళన బుకింగ్‌లను నివారించాలని సూచించారు.వినియోగదారులు అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని తెలియజేయాలని సూచించారు. అదే విధంగా ఎంఎల్ఏలు వారి వారి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున తెలియజేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు LPG పంపిణీదారులతో రోజువారీ సమీక్షలు నిర్వహించి ఎప్పటి కప్పుడు తాజా సమాచారాన్ని , జిల్లా సమాచార శాఖ అధికారులు ద్వారా మీడియాకు వివరించాలని సూచించారు. జిల్లా కంట్రోల్ రూమ్‌లు ద్వారా పంపిణీదారుల వారీగా స్టాక్‌ను ట్రాక్ చేయాలని, వినియోగదారుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించారని కమీషనర్ సౌరవ్ గౌర్ స్పష్టం చేశారు.
అందరు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు తప్పని సరిగా ఆయా కేంద్రాల వద్ద కరెంట్ స్టాక్, పెండింగ్ బుకింగ్స్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ ఆఫ్ టైంలైన్స్ పై డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.అదే విధంగా ఆర్డీవో లు, తహసిల్దార్లు ఎల్పిజి
ఏజెన్సీలను తరచు సందర్శించాలని ఆదేశించారు. జిల్లాలో LPG సరఫరా సాధారణంగా ఉంది మరియు తగినంత స్టాక్ అందుబాటులో ఉందని ఆయిల్ కంపెనీలు క్రమం తప్పకుండా సిలిండర్ డెలివరీని నిర్ధారిస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పుకార్లను నమ్మవద్దని పౌరులకు ఎప్పటి కప్పుడు విజ్ఞప్తి చేయాలని సౌరవ్ గౌర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఆసుపత్రులు,చిన్న చిన్న హోటళ్ళు,బడ్డీ షాపులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
జిల్లా కలెక్టర్లు జిల్లాలో ఎల్పిజి స్టాక్ పొజిషన్, పెండింగ్ రీఫిల్ డబుకింగ్స్,డిస్ట్రిబ్యూర్ కంప్లైంట్లు, ఆసుపత్రులు, సంస్థలకు సరఫరా,ఎక్కడైనా శాంతి భద్రతలు సమస్యలు తలెత్తిన వంటి అంశాలపై ప్రతి రోజు ఉ.10గం.లకు సా.6గం.ల కు రెండు పర్యాయాలు డైలీ నివేదికలు సమర్పించాలని స్పష్టం సౌరవ్ గౌర్ చేశారు.
ఆర్టీజిఎస్ ద్వారా ఎప్పటికప్పుడు LPG కొరతపై వచ్చే పుకార్లను పర్యవేక్షించి వాస్థవ తనిఖీలు (fact checks) జారీ చేయాలని సూచించారు. సిలిండర్ డెలివరీ కార్యకలాపాల ఫోటోలు/వీడియోలను షేర్ చేయాలని తెలిపారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా LPG సరఫరా సాధారణంగా ఉందని బాట్లింగ్ ప్లాంట్లు పని చేస్తున్నాయని, సరఫరా సజావుగా సాగుతోందని పుకార్ల వల్ల పెరిగిన బుకింగ్‌ల కారణంగా తాత్కాలిక జాప్యాలు జరగవచ్చని వినియోగదారులు భయాందోళనతో బుకింగ్స్ చేయవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరవ్ గౌర్ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News